ప్రోటెం స్పీకర్ గా కమల్ నాథ్
మాజీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమలనాథ్ ప్రస్తుత లోకసభలో ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించనున్నారు.
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ప్రస్తుత లోకసభలో ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించనున్నారు.
లోకసభలో సీనియర్ సభ్యుడిగా ఉన్న కమల్ నాథ్ ను ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేసినట్టు వెంకయ్యనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం స్పీకర్ ను ఎన్నుకునేంత వరకు కమల్ నాథ్ ప్రోటెం స్పీకర్ హోదాలో సభ వ్యవహారాలను నిర్వహిస్తారు.
గత ప్రభుత్వంలో పట్టణాభివృద్ది శాఖను నిర్వహించిన కమల్ నాథ్ మధ్యప్రదేశ్ లోని చింద్వారా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అంతేకాక లోకసభలో కమలనాథ్ ను ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎన్నుకుంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.