
ఆర్. భానుమతి
న్యూఢిల్లీ: దాదాపు పదేళ్ల తర్వాత సుప్రీంకోర్టు కొలీజియంలో ఓ మహిళా జడ్జి నియమితులయ్యారు. ఇప్పటి వరకూ కొలీజియంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ గొగోయ్ ఆదివారం పదవీ విరమణ చేయడంతో తమిళనాడుకు చెందిన జస్టిస్ ఆర్. భానుమతి ఎంపికయ్యారు. 2014 ఆగస్టు 13 నుంచి ఆమె సుప్రీంకోర్టులో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె మద్రాసు హైకోర్టు, జార్ఖండ్ హైకోర్టులలో పనిచేశారు. ప్రస్తుతం కొలీజియంలో జస్టిస్ భానుమతితో పాటు జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్ సభ్యులుగా ఉన్నారు.