తప్పుడు వార్త రాస్తే.. గుర్తింపు రద్దు.. | Journalists Who Spread Fake News Will Lose Accredations | Sakshi
Sakshi News home page

తప్పుడు వార్త రాస్తే.. గుర్తింపు రద్దు..

Apr 3 2018 9:32 AM | Updated on Oct 4 2018 8:34 PM

Journalists Who Spread Fake News Will Lose Accredations - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నకిలీ వార్తలు పుట్టించినా, ప్రచారం చేసిన జర్నలిస్టుల గుర్తింపును రద్దు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విలేకరుల గుర్తింపునకు సంబంధించిన నియమావళిని సవరరించింది. నిబంధనల ప్రకారం.. నకిలీ వార్తలను ప్రచురించడం, ప్రసారం చేసినట్లు నిర్ధారణ అయితే సదరు జర్నలిస్టు గుర్తింపును రద్దు చేస్తారు.

తొలి ఉల్లంఘన కింద ఆరు నెలల పాటు, రెండో సారీ అదే పని చేస్తే సంవత్సరం పాటు, మూడోసారీ తప్పు చేస్తే గుర్తింపును శాశ్వతంగా రద్దు చేయనుంది ప్రభుత్వం. ఫేక్‌ న్యూస్‌పై వచ్చే ఫిర్యాదులను పీసీఐ, ఎన్‌బీఏలు పరిశీలించి 15 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తాయని ప్రభుత్వం వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement