నిత్యానందస్వామి అరెస్టయ్యేనా?

Jhansi Rani Demands Arrest to Nithyananda in Daughter Death Case - Sakshi

తిరుచ్చి యువతి మృతి కేసు

చెన్నై, టీ.నగర్‌: తిరుచ్చి యువతి అనుమానాస్పద మృతి వ్యవహారంలో నిత్యానందస్వామి అరెస్టయ్యేనా? అనే ఊహాగానాలు రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్నాయి. తిరుచ్చి సమీపంలోని నవలూరు మేలవీధికి చెందిన అర్జునన్‌ భార్య ఝాన్సీరాణి (56). వీరి మూడో కుమార్తె సంగీత బీసీఏ పట్టభద్రురాలు. ఇలావుండగా ఈమె చెన్నై, బెంగుళూరులోని నిత్యానందస్వామి ధ్యాన తరగతులకు వెళ్లి వస్తుండేది. ఇలావుండగా 2014 డిసెంబర్‌ 28న బెంగళూరు నిత్యానంద ఆశ్రమంలో ఉన్న శిష్యుడు ప్రాణానంద ఝాన్సిరాణిని ఫోన్‌లో సంప్రదించి తమ కుమార్తె సంగీత గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు.

దీంతో కుమార్తె మృతిలో అనుమానం ఉన్నట్లు ఝాన్సిరాణి బెంగుళూరు రాంనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 2015లో తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్‌ శరవణన్‌ ఆధ్వర్యంలో సంగీత మృతదేహానికి రీపోస్టుమార్టం జరిపారు. ఇలావుండగా సంగీత తల్లి ఝాన్సీరాణి, నిత్యానంద లైంగిక హింసలకు గురైన ఆర్తిరావు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఒక లేఖ రాశారు. దీంతో ఆయన విదేశాల్లో తలదాచుకున్న నిత్యానందను ఇక్కడికి రప్పించి అరెస్టు చేయాలని కోరారు. దీనిపై ఝాన్సీరాణి స్పందిస్తూ సీబీఐ విచారణకు తాను అందజేసిన పిటిషన్‌పై చర్యలకు ఆదేశించడంతో తన కుమార్తె ఆత్మ తనను హతమార్చిన వారికి కచ్చితంగా దండన ఇప్పిస్తుందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top