
జయలలిత గెలుపును సవాల్ చేసిన ఓటరు
జయలలిత ఎన్నికను సవాల్ చేస్తూ ఆర్కే నగర్ నియోజకవర్గానికి చెందిన ప్రవీణ అనే ఓటరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్నికను సవాల్ చేస్తూ ఆర్కే నగర్ నియోజకవర్గానికి చెందిన ప్రవీణ అనే ఓటరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. జయలలిత అక్రమంగా గెలిచారని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. పోలింగ్ బూతులను ఆక్రమించి, ఓటర్లకు డబ్బులు పంచిపెట్టి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం దురైసామి.. ఎన్నికల కమిషన్ అధికారులకు, జయలలితకు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 16లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించించారు. మే 16న జరిగిన ఎన్నికల్లో ఆర్ కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ జయలలిత.. డీఎంకే అభ్యర్థి సిమ్లా ముత్తుపై 39,545 ఓట్ల మెజారిటీతో గెలిచారు.