మంచుకొండలు మండిపడుతున్నాయి. నిప్పు కణికలను కక్కుతున్నాయి. అవును.. జమ్ములో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది.
మంచుకొండలు మండిపడుతున్నాయి. నిప్పు కణికలను కక్కుతున్నాయి. అవును.. జమ్ములో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గురువారం నాడు నమోదైంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే ఐదు డిగ్రీలు ఎక్కువని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
జమ్ములో జూన్ నెలలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 47.2 డిగ్రీలు. ఇది 1953 జూన్ 12వ తేదీన నమోదైంది. ఆ తర్వాత ఎప్పుడూ ఇంత ఎక్కువ స్థాయిలో అక్కడ ఉష్ణోగ్రత లేదు. బహుశా ఈ సంవత్సరం దాన్ని దాటిపోవచ్చేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో జమ్ములో ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని, కొంతమేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ ఉష్ణోగ్రత కారణంగా ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడుతుండే జమ్ము ఈసారి మాత్రం వెలవెలబోతోంది.