మాపై రాళ్లు, పెట్రోల్‌ బాంబులు వేశారు: మేజర్‌ | J&K human shield row: Major defends his act, says took step to save civilians | Sakshi
Sakshi News home page

మాపై రాళ్లు, పెట్రోల్‌ బాంబులు వేశారు: మేజర్‌

May 23 2017 8:25 PM | Updated on Sep 5 2017 11:49 AM

మాపై రాళ్లు, పెట్రోల్‌ బాంబులు వేశారు: మేజర్‌

మాపై రాళ్లు, పెట్రోల్‌ బాంబులు వేశారు: మేజర్‌

జీపు ముందు భాగంలో ఓ యువకుడిని కట్టేయడంపై ఆర్మీ మేజర్‌ లీతుల్‌ గోగోయ్‌ స్పందించారు.

శ్రీనగర్‌: జీపు ముందు భాగంలో ఓ యువకుడిని కట్టేయడంపై ఆర్మీ మేజర్‌ లీతుల్‌ గోగోయ్‌ స్పందించారు. జమ్మూకశ్మీర్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించుకోకపోవడంపై మీడియాతో మాట్లాడారు. స్ధానిక ప్రజలను కాపాడేందుకు అలా చేసినట్లు చెప్పారు. ఎన్నికలు జరుగుతున్న బూత్‌ దగ్గరకు వెళ్లిన తమపై 1200 మంది స్ధానికులు రాళ్లు, పెట్రోల్‌ బాంబులు విసరడం ప్రారంభించినట్లు తెలిపారు.

ఆ సమయంలో తమ వద్ద రెండు ఆప్షన్లు ఉన్నాయని అందులో ఒకటి తాము తిరిగి వారిపై కాల్పులు చేయడం లేదా ఆత్మరక్షణకు హ్యూమన్‌ షీల్డ్‌ కోసం ఒక యువకుడిని ఉపయోగించడమని చెప్పారు. ఇందులో తాము రెండో ఆప్షన్‌ను ఎంచుకుని రాళ్లు రువ్వుతున్న ఓ యువకుడిని పట్టుకుని జీపు బానెట్‌కు కట్టేసినట్లు తెలిపారు. రాళ్లు రువ్వుతున్న వారిపై కాల్పులు జరపకుండా వారి ప్రాణాలను కాపాడటానికి కూడా ఇది ఉపయోగపడిందని వివరించారు.

మేజర్‌ గోగోయ్‌కు ఆర్మీ స్టాఫ్‌కు అందించే ప్రెస్టెజియస్‌ కమన్‌డెషన్‌ కార్డును గత వారం ఆర్మీ చీఫ్ బిపిన్‌ రావత్‌ అందజేసినట్లు తెలిసింది. విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించిన అధికారులను కమన్‌డెషన్‌ కార్డును ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement