రూ. 237 కోట్ల రధ్దైన నోట్లను మార్చిన శశికళ

IT  Notice Claims Sasikala Used Demonetised Currency to Buy Properties - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసిన సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి శశికళ ఒక పారిశ్రామికవేత్తను బెదిరించి చెల్లనినోట్లను ఇచ్చి ఆస్తులను కొనుగోలుచేశారని వెల్లడైంది. ప్రభుత్వ పౌష్టికాహార కాంట్రాక్టర్‌ను బెదిరించి రూ. 237 కోట్ల రద్దైన నోట్లకు వడ్డీ సహా కొత్తనోట్లను చెల్లించేలా ఒప్పందం చేసుకున్న సంగతిని కోర్టుకు సమర్పించిన పత్రం ద్వారా ఐటీశాఖ బయటపెట్టింది. నోట్ల రద్దప్పుడు శశికళ ఒక పారిశ్రామిక వేత్తను బెదిరించి రద్దైన నోట్లను అందజేసి రూ.1,674 కోట్ల ఆస్తులను కొన్నట్లు పేర్కొంది. ‘రుణం కింద రూ.240 కోట్ల పాత నోట్లిస్తాం. బదులుగా ఏడాది తర్వాత 6 శాతం వడ్డీ సహా కొత్త నోట్లను చెల్లించాలని డీల్‌ కుమారస్వామి అనే వ్యాపారితో శశికళ ఒప్పందం కుదుర్చుకుంది’ అని ఐటీశాఖ పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top