నిర్దేశించిన సమయానికి ఉపగ్రహం తయారీ పూర్తికాకపోవడంతో మార్చి 31న జరగాల్సిన ఇస్రో... ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహ ప్రయోగం వాయిదాపడింది.
శ్రీహరికోట(సూళ్లూరుపేట): నిర్దేశించిన సమయానికి ఉపగ్రహం తయారీ పూర్తికాకపోవడంతో మార్చి 31న జరగాల్సిన ఇస్రో... ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహ ప్రయోగం వాయిదాపడింది. ఏప్రిల్ మూడో వారానికి వాయిదాపడినట్లు తెలుస్తోంది. మార్చి 10న పీఎస్‌ఎల్‌వీ సీ32 ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్‌ను, మార్చి 31న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీను ప్రయోగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
మార్చి 10న ప్రయోగించబోయే ఉపగ్రహానికి షార్‌లోని క్లీన్‌రూంలో ఇంధనాన్ని నింపే ప్రక్రియ చేపడుతున్నారు. మరో రెండు మూడురోజుల్లోనే రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్‌కు శాటిలైట్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను చేపట్టనున్నారు.