మిఠాయిలు పంచుకున్న భారత్, పాక్ సైన్యం | Indo-Pak forces at border exchange sweets on Diwali festival | Sakshi
Sakshi News home page

మిఠాయిలు పంచుకున్న భారత్, పాక్ సైన్యం

Nov 11 2015 6:23 PM | Updated on Sep 3 2017 12:22 PM

మిఠాయిలు పంచుకున్న భారత్, పాక్ సైన్యం

మిఠాయిలు పంచుకున్న భారత్, పాక్ సైన్యం

భారత్, పాక్ సరిహద్దుల్లో దీపావళి పండుగ వాతావరణం కనిపించింది.

న్యూఢిల్లీ: భారత్, పాక్ సరిహద్దుల్లో దీపావళి పండుగ వాతావరణం కనిపించింది. గత కొంతకాలంగా కాల్పుల మోతతో దద్దరిల్లిన సరిహద్దు ప్రాంతాలు దీపావళితో పండుగశోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా సరిహద్దుల్లో భారత్, పాక్ సైన్యాలు మిఠాయిలు పంచుకున్నారు.

పంజాబ్ అమృతసర్లోని అట్టారి సరిహద్దు వద్ద భారత్ కమాండెంట్ బిపుల్ బిర్ గుసేన్, పాక్ కమాండర్ బిలాల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఇరుదేశాల సిబ్బంది మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం సైనిక సిబ్బంది ఆలింగనం చేసుకుని స్నేహబంధాన్ని చాటుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement