రైలు బండి.. షరతులు ఇవేనండీ

Indian Railways is set to restart 15 passenger services - Sakshi

ప్రయాణ మార్గదర్శకాలు జారీచేసిన రైల్వే శాఖ

సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నుంచి ఊరట కల్పి స్తూ పరిమిత మార్గాల్లో రైలు ప్రయాణానికి పచ్చజెండా ఊపిన కేంద్రం ప్రయాణికులను  గమ్యస్థానం చేర్చేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బుకింగ్‌ ప్రొటోకాల్‌పై రైల్వే శాఖ పలు మార్గదర్శకాలు జారీచేసింది. ‘తొలుత 15 మార్గాల్లో 15 జతల (30 రానుపోను ప్రయాణాలు) రైళ్లను ప్రారంభిస్తున్నాం. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఇతర రెగ్యులర్‌ ప్యాసింజర్‌ సర్వీసెస్, మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబ్‌ అర్బన్‌ సర్వీసులు ఎలాంటి సేవలు అందించవు’ అని పేర్కొంది.

మార్గదర్శకాలివీ...
► ప్రస్తుతం పనిచేయనున్న ప్రత్యేక రైళ్లలో ఏసీ తరగతులే ఉంటాయి. ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ కోచ్‌లే ఉంటాయి.  
► రాజధాని రైళ్లలో రెగ్యులర్‌ టైమ్‌ టేబుల్‌ ప్రకారం ఉండే చార్జీలు ఈ స్పెషల్‌ ట్రైన్లకు వర్తిస్తాయి. కేటరింగ్‌ చార్జీలు ఉండవు.
► ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ ద్వారానే బుకింగ్‌ చేసుకునే వీలుంది.  
► టికెట్ల బుకింగ్‌కు కౌంటర్లు ఉండవు. రైల్వే, ఐఆర్‌సీటీసీ ఏజెంట్ల ద్వారా బుక్‌ చేసుకోవడానికి వీలు లేదు.
►  రిజర్వేషన్‌ గరిష్టంగా తదుపరి ఏడు రోజులలోపు ప్రయాణానికి మాత్రమే.  
►  కన్ఫర్మ్‌డ్‌ టికెట్లను మాత్రమే అనుమతిస్తారు. ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ టికెట్‌ను అనుమతించరు.  
►  కరెంట్‌ బుకింగ్, తత్కాల్‌ బుకింగ్, ప్రీమియం తత్కాల్‌ బుకింగ్‌ అనుమతించరు. అన్‌ రిజర్వ్‌డ్‌ టికెట్లు(యూటీఎస్‌) అనుమతించరు..

భోజన వసతి లేదు
►  ప్రయాణ చార్జీల్లో క్యాటరింగ్‌ చార్జీలు ఉండవు. æ ప్రీ పెయిడ్‌ మీల్‌ బుకింగ్‌ (భోజనం కోసం ముందస్తు చెల్లింపు), ఈ–క్యాటరింగ్‌ వెసులుబాటు ఉండదు.
►  పరిమితమైన ఆహార పదార్థాలు, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ (నీటి సీసాలు) చెల్లింపు పద్ధతిలో అందించేందుకు ఐఆర్‌సీటీసీ ఏర్పాట్లు చేస్తుంది. బుకింగ్‌వేళ దీనికి సంబంధించిన సమాచారం తెలుస్తుంది.
►  పొడిగా ఉండే ఆహారం, తినడానికి సిద్ధంగా ఉండే ఆహారం (రెడీ టూ ఈట్‌), నీటి సీసాలు చెల్లింపు పద్ధతిలో ప్రయాణంలో అందుబాటులో ఉంటాయి..
►    ప్రయాణికులందరినీ తప్పనిసరిగా స్క్రీనిం గ్‌ చేస్తారు. కోవిడ్‌ లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు.
►   రైల్లో ఎలాంటి బ్లాంకెట్లు, లినెన్‌ క్లాత్, కర్టెయిన్లు అందుబాటులో ఉండవు. అందువల్ల కోచ్‌లలో ఏసీ కూడా ఇందుకు అనుగుణంగా మెయింటేన్‌ చేస్తారు.
►   బెడ్‌షీట్‌ను ప్రయాణికులు ఇంటి నుంచి తెచ్చుకోవచ్చు.
►    ప్లాట్‌ఫామ్‌లలో ఎలాంటి స్టాళ్లు, బూత్‌లు తెరిచి ఉండవు. వెండర్ల అమ్మకాలు కూడా ఉండవు.
►     రైల్వే స్టేషన్లకు చేరేందుకైనా, స్టేషన్ల నుంచి ఇంటికి వెళ్లేందుకైనా ప్రయాణికులకు కన్ఫర్మ్‌ టికెట్‌ ఉంటేనే ఆయా వాహనాల డ్రైవర్లకు సహా వెసులుబాటు ఉంటుంది.
►     ప్రతి ప్రయాణికుడు ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

క్యాన్సలేషన్‌ ఇలా..
►    టికెట్‌ రద్దు (క్యాన్సలేషన్‌) చేసుకోవాలనుకుంటే రైలు బయలుదేరే షెడ్యూలు సమయం కంటే 24 గంటల ముందు అనుమతిస్తారు.  
►    24 గంటల కంటే తక్కువ సమయం ఉంటే టికెట్‌ రద్దుకు అనుమతించరు.  
►    క్యాన్సలేషన్‌ చార్జీగా టికెట్‌ ధరలో 50 శాతం విధిస్తారు.

ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు   
►   రైలు ఎక్కేటప్పుడు, రైలు ప్రయాణంలో తప్పనిసరిగా మాస్క్‌ లేదా ఫేస్‌ కవర్‌ ధరించాలి.
►    షెడ్యూలు సమయం కంటే 90 నిమిషాలు ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలి. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు.
►  ప్రయాణికులు స్టేషన్లలో, రైళ్లలో భౌతిక దూరం పాటించాలి.
►    గమ్యం చేరాక ప్రయాణికులు ఆయా రాష్ట్రాలు విధించిన ఆరోగ్య నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top