లాక్‌డౌన్‌: 10 లక్షల అసురక్షిత అబార్షన్లు!

India Lockdown will Result in More Unsafe Abortions - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నేడు పిల్లలు కలగకుండా ఉండేందుకు అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. పురుషుల కండోమ్స్, స్త్రీల కండోమ్స్‌తోపాటు మాత్రలు, ఇంజెక్లు, ఆ తర్వాత స్టెరిలైజేషన్లు ఉన్నాయి. వీటిలో వేటిని ఎంత మంది వాడుతారో, ఏవీ వాడకుండా ఎంత మంది పిల్లలను కంటోరో? చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ 35 లక్షల స్టెరిలైజేషన్లు, 57 లక్షల ఇంట్రా–యుటరిన్‌ గర్భనిరోధక పరికరాలు, 18 లక్షల ఇంజెక్షన్లు, 41 కోట్ల సైకిళ్లకు సరిపోయే గర్భ నిరోధక మాత్రలు, 25 లక్షల అత్యవసర గర్బనిరోధక మాత్రలు, 32 కోట్ల కండోమ్స్‌ను మెడికల్‌ షాపుల ద్వారా కేంద్రం అందుబాటులో ఉంచింది. (వలస కార్మికులకు అండగా హైకోర్టులు)

అయినప్పటికీ అనవసరంగా వచ్చే గార్భావకాశాలు కూడా భారత్‌లో ఎక్కువ. అందుకని ఈ ఏడాది కూడా 14.5 లక్షల అబార్షన్లు జరుగుతాయని, వాటిలో 8,34,042 సురక్షితంగానీ నాటు పద్ధతిలో అబార్షన్లు జరుగుతాయని, అయినప్పటికీ 6,79,864 ప్రసవాలు సంభవిస్తాయని ఆరోగ్య శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా అవాంఛిత ప్రెగ్నెసీల సంఖ్య 23 లక్షలకు చేరుకుంటుందని, వాటిలో సురక్షితంగానీ అబార్షన్ల సంఖ్య పది లక్షలకు చేరుకుంటుందని ఆరోగ్య శాఖ అంచనాలు తెలియజేస్తున్నాయి. ప్రసవాల సంఖ్య 8,44,488 చేరుకోవచ్చని ఆరోగ్య శాఖ అంచనా. అవాంఛిత గర్భాలను తీసివేయక పోయినట్లయితే ప్రసవాల సంఖ్య మరింతగా పెరగుతుంది. సురక్షితంగానీ అబార్షన్ల వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదంతోపాటు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. (అక్కడ నిషేధించారు.. మన దేశంలో ఎప్పుడు?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top