ఎఫ్‌జీఎంను నిషేధించిన సూడాన్‌

Sudanese Government Bans Female Genital Mutilation - Sakshi

న్యూఢిల్లీ : లైంగిక కోరికలు కలుగకుండా ఉండేందుకు బాలికలకు ‘ఫిమేల్‌ జెనిటల్‌ మ్యుటేషన్‌ (ఎఫ్‌జీఎం) టైప్‌–3’ నిర్వహించే రాక్షస దురాచారాన్ని నిషేధిస్తూ సూడాన్‌ దేశం మే 1వ తేదీన చట్టం తీసుకొచ్చింది. ఈ ఆచారాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ బాధ్యులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చారు. కరోనా వార్తల కారణంగా ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూడాన్‌లో 87 శాతం బాలికలకు టైపు–3 జెనిటల్‌ మ్యుటేషన్‌ నిర్వహిస్తారు. మహిళల అంగాల్లో లైంగిక వాంఛను ప్రేరేపించే అంగాన్ని తొలగించడాన్ని జెనిటల్‌ మ్యుటేషన్‌ అని వ్యవహరిస్తారు.

ఈ దురాచారం భారత్‌లోని ‘బొహ్రా’ జాతి ప్రజల్లో కూడా ఉంది. ఆ జాతిలో ఆరేడేళ్ల వయస్సు వచ్చిన బాలికల్లో 75 నుంచి 80 శాతం ఎఫ్‌జీఎల్‌ను నాటు పద్ధతిలో నిర్వహిస్తారు. దీన్ని ‘కఫ్జ్‌ లేదా కాట్నా’ అని కూడా వ్యవహరిస్తారు. భారత్‌లో దాదాపు 20 లక్షల మంది బొహ్రా జాతి జనులు ఉన్నారు. వారిలో ఇప్పటికీ కొనపాగుతున్న ఈ దురాచారాన్ని నిషేధించాల్సిందిగా ఎన్నో దశాబ్దాలుగా సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తూ వస్తోన్న భారత్‌ ప్రభుత్వాలు ఇంతవరకు స్పందించలేదు. ఆ ఆచారం వారిలో లేదని కొట్టేస్తూ వచ్చాయి. లేనప్పుడు నివారణ చట్టం తీసుకొస్తే వచ్చే నష్టం ఏముందన్న మహిళా సంఘాల ప్రశ్నకు, ఇండియన్‌ పీనల్‌ కోడ్, ప్రొడక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్యువల్‌ అఫెన్సెస్‌ చట్టాలు సరిపోతాయంటూ వాదిస్తూ వచ్చాయి. ఈ దురాచారంపై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలయిన ఓ పిటిషన్‌ ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. (షాకింగ్‌ : కరోనాకు ముందు - ఆ తర్వాత!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top