అంతరిక్ష కేంద్రాన్నీ నిర్మించగలం: ఇస్రో ఛీఫ్‌ | Sakshi
Sakshi News home page

అంతరిక్ష కేంద్రాన్నీ నిర్మించగలం: ఇస్రో ఛీఫ్‌

Published Tue, Feb 21 2017 2:02 AM

అంతరిక్ష కేంద్రాన్నీ నిర్మించగలం: ఇస్రో ఛీఫ్‌

ఇండోర్‌: భారత్‌కు అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే సామర్థ్యముందని అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్  కిరణ్‌ తెలిపారు. అయితే ఇందుకోసం దీర్ఘకాల వ్యూహం, పటిష్టమైన ప్రణాళిక అవసరమన్నారు. ఇండోర్‌లో సోమవారం జరిగిన రాజా రామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్ డ్‌ టెక్నాలజీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన కిరణ్‌ కుమార్‌.. ‘అంతరిక్ష కేంద్రం నిర్మించే సామర్థ్యం మనకుంది.

దేశం నిర్ణయం తీసుకున్న రోజు మేం ప్రాజెక్టును స్వీకరిస్తాం. ఇందుకోసం విధి విధానాలను రూపొందించి కావాల్సిన నిధులు, సమయం ఇస్తే చాలు’ అని తెలిపారు. మానవరహిత అంతరిక్ష కేంద్రం వల్ల ఉపయోగమేంటనే అంశంపైనా ఇంకా చర్చిస్తున్నామని అందుకే ఈ దిశగా ఆలోచన చేయలేదన్నారు. వాతావరణ పరిస్థితులు, కమ్యూనికేషన్  నెట్‌వర్క్‌ రంగాల్లో విస్తృత పరిశోధనలకోసం మరిన్ని ఉపగ్రహాలను పంపించాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement