breaking news
Space Centre
-
అంతరిక్షంలో డేటా స్థావరాలు..
మీరు వాట్సాప్ సందేశం పంపిన ప్రతిసారీ, నెట్‌ఫ్లిక్స్ షో చూసిన ప్రతిసారీ, లేదా గూగుల్‌లో ఏదైనా వెతికిన ప్రతిసారీ.. మీరు ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఒక డేటా సెంటర్‌కు కనెక్ట్ అవుతున్నారని అర్థం. ఆధునికమైన భారీ ఇంటర్నెట్ గిడ్డంగులలో అమర్చిన వేలాది శక్తిమంతమైన సర్వర్లు పని చేసే స్థలాలే డేటా సెంటర్లు. ఇప్పుడిక అంతరిక్షంలో కూడా వీటి స్థావరాలను నెలకొల్పటం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి!కృత్రిమ మేధ (ఏఐ) వాడకం విపరీతంగా పెరగడంతో, దానికి తగ్గ కంప్యూటింగ్ పవర్ కోసం ‘స్పేస్ఎక్స్’ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు అంతరిక్షం వైపు చూస్తున్నాయి. భూమి మీదున్న పర్యావరణ, మౌలిక సదుపాయాల సవాళ్లను అధిగమించడానికి ‘ఆర్బిటల్ డేటా సెంటర్లు’ ఒక విప్లవాత్మక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే, అంతరిక్షంలోని కఠిన వాతావరణం, కూలింగ్ సమస్యలు, అధిక ఖర్చుల దృష్ట్యా.. ఈ అత్యాధునిక సాంకేతికత ఎంతవరకు సాధ్యపడుతుందనేది పెద్ద ప్రశ్న.నింగి వైపు కంపెనీల చూపుఅంతరిక్షంలో డేటా సెంటర్లు పెట్టేందుకు టెక్నాలజీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. భూమి మీద పడే పర్యావరణ భారాల్ని తగ్గించుకుంటూ, అంతరిక్షంలో సమృద్ధిగా దొరికే సౌరశక్తిని వాడుకోవడం ఈ డేటా సెంటర్ల ఏర్పాటు ఆలోచనలోని ముఖ్య ఉద్దేశం. కానీ, అంతరిక్షంలో కంపెనీని నడపటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. పైగా అక్కడి వాతావరణం కూడా అనుకూలంగా ఉండదు. యంత్రాలను చల్లబరచడం, మరమ్మతులను చూసుకోవడం, రేడియేషన్ ప్రభావం, అక్కడ తిరిగే అంతరిక్ష వ్యర్థాల వంటి సవాళ్లు కూడా ఉంటాయి.మస్క్ జోరు.. ఇన్వెస్టర్ల హోరు!అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్ఎక్స్’ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారంటే, అంతరిక్షంలో డేటా సెంటర్ ఏర్పాటుకు స్పేస్ఎక్స్ ప్రయత్నాలు మొదలు పెట్టటమే కారణం. ఇన్వెస్టర్లు ఇప్పుడు కేవలం రాకెట్ల మీద మాత్రమే డబ్బులు కుమ్మరించటం లేదు, మొత్తం అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ మీదే ఆశలు పెట్టుకున్నారు. వినడానికే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉండే ‘ఆర్బిటల్ డేటా సెంటర్ల’ను నిర్మించేందుకు కుతూహలపడుతున్న కంపెనీల్లో స్పేస్ఎక్స్ చాలా పాపులర్ కావచ్చు కానీ, ఈ పోటీలో ఉన్నది అదొక్కటే కాదు.అదిరే ఐడియా.. బెదిరే భారండేటా సెంటర్లను అంతరిక్షంలో ఏర్పాటు చేస్తే అక్కడ పుష్కలంగా సౌరశక్తి లభ్యం అవుతుంది. భూమి మీదలా స్థలం, నీళ్లు, కరెంట్ గ్రిడ్ల అవసరం ఉండదు. ప్రపంచమంతటా ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోతుండటంతో భూమి మీద పడుతున్న పర్యావరణ భారాన్ని, మౌలిక సదుపాయాల ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి ఈ ‘అంతరిక్ష డేటా సెంటర్లు’ ఒక మంచి ఆలోచన అని కంపెనీలు నమ్ముతున్నాయి. పైగా, ఈ డేటా సెంటర్ల వల్ల తమ ప్రాంతంలో సమస్యలు వస్తున్నాయని చాలా చోట్ల స్థానికులు చేస్తున్న ఆందోళనల తలనొప్పి కూడా తప్పుతుంది.అయితే, ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి, ఒక పరిశ్రమ స్థాయిలో కంప్యూటింగ్ నెట్‌వర్క్‌ను అక్కడ నడపడానికి మధ్య చాలా తేడా ఉంది. అంతరిక్షంలో ఉండే రేడియేషన్ వల్ల ఎలక్టాన్రిక్ ఉపకరణాలు పాడైపోతాయి. కంప్యూటర్ల వల్ల విపరీతమైన వేడి జనిస్తుంది. అంతరిక్షంలో ఆ వేడిని చల్లబరచడం తేలిక కాదు. చిన్న మరమ్మతుకు కూడా భారీగా ఖర్చవుతుంది. ఇవన్నీ అటుంచి, కింది నుంచి పైకి పంపే ప్రతి కిలో బరువుకీ సుమారు 6 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది.కరెంటుకు, నీళ్లకు ఖర్చు తక్కువభూమి మీద లాగే అంతరిక్షంలో కూడా డేటా సెంటర్లకు భారీ స్థాయిలో విద్యుత్తు అవసరం. అయితే అక్కడ ఈ విద్యుత్ అంతా సౌరశక్తి (సోలార్ ప్యానెల్స్) ద్వారానే లభిస్తుంది. అంతరిక్షంలో సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు, మేఘాలు కూడా అడ్డుపడవు. కాకపోతే, మనం ఆ సోలార్ ప్యానెల్స్‌ను ఏ కక్ష్యలో పెట్టామనే దాన్ని బట్టి అవి తిరిగేటప్పుడు భూమి అడ్డువచ్చి కొంతసేపు నీడ పడే అవకాశం ఉంటుంది.‘ఏఐ1 కంప్యూట్ శాటిలైట్’ డిజైన్డేటా సెంటర్ల ఏర్పాటుకు అంతరిక్షంలో ఉండే ఇంకో ప్రతికూలాంశం ఏంటంటే... కూలింగ్. అంతరిక్షం వెనుక (నక్షత్రాలు, గ్రహాలు లేని శూన్యమైన ఖాళీ అంతరిక్షపు ఉపరితలం) ఉండే వాతావరణం చాలా చల్లగా (దాదాపు మైనస్ 270 డిగ్రీల సెల్సియస్) ఉంటుంది. డేటా సెంటర్ నుండి వచ్చే వేడిని రేడియేటర్ల ద్వారా ఆ ఖాళీలోకి వదిలేయొచ్చు. భూమి మీద ఎక్కువ నీళ్లు వాడుకునే కూలింగ్ సిస్టమ్స్ అవసరం అంతరిక్షంలో ఉండదు. కానీ, ఆ వేడిని బయటకు పంపే థర్మల్ రేడియేటర్ల కోసం చాలా విస్తారంగా స్థలం మాత్రం కావాల్సి ఉంటుంది.అంతరిక్షంలో వేడెక్కిన మిషన్ల మీదకు గాలి పంపి చల్లబరచడానికి అక్కడ గాలే ఉండదు. వేడి అంతా ‘ఇన్ఫ్రారెడ్ రేడియేషన్’ (ఉష్ణ కిరణాలు) రూపంలోనే చాలా నిదానంగా బయటకు వెళ్లాలి. దీనివల్ల 10 మెగావాట్ల వేడిని బయటకు పంపించాలన్నా సరే, దాదాపు రెండు ఫుట్‌బాల్ గ్రౌండ్లంత పెద్ద రేడియేటర్ స్థలం కావాల్సి వస్తుంది. ఇప్పటికే అంతరిక్షం రద్దీగా మారిపోయింది. ఇప్పుడు వేల సంఖ్యలో ఇలాంటి పెద్ద పెద్ద డేటా సెంటర్లను స్పేస్‌లోకి పంపితే ఈ సమస్య ఇంకా ఎక్కువవుతుంది. అక్కడ తిరిగే అంతరిక్ష వ్యర్థాలు, చిన్న చిన్న ఉల్కలు గనక ఈ డేటా సెంటర్‌ను బలంగా ఢీకొడితే... అది ముక్కలైపోవడమే కాకుండా, అంతరిక్షంలో ఇంకాస్త ఎక్కువ చెత్త తయారవుతుంది.స్పేస్ఎక్స్ డిజైన్ సిద్ధమైంది!ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, కంపెనీలు మాత్రం అంతరిక్ష డేటా సెంటర్ల డిజైన్లతో ముందుకు దూసుకెళ్తున్నాయి. స్పేస్ఎక్స్ ఈ మధ్యే తన ‘ఏఐ1 కంప్యూట్ శాటిలైట్’ డిజైన్‌ను ప్రకటించింది. దీన్ని ఒక ‘ఆర్బిటల్ డేటా సెంటర్ స్పేస్‌క్రాఫ్ట్’లా వాడాలని దాని ఆలోచన. కాకపోతే, ప్రస్తుతం భూమి మీదున్న డేటా సెంటర్లతో పోలిస్తే దీని సామర్థ్యం 100 నుండి 1,000 రెట్లు తక్కువ.అన్ని రకాల కంప్యూటర్ పనులని స్పేస్‌లో చేయడం కుదరదు. ఆర్థిక లావాదేవీలు (ఆన్లైన్ పేమెంట్లు), లైవ్ ఏఐ సర్వీసులు, క్లౌడ్ అప్లికేషన్లలో చిన్న ఆలస్యం ఉన్నా వ్యవస్థ అసలే నడవదు. కాబట్టి, ప్రారంభంలో కాస్త ఆలస్యమైనా పర్వాలేదు అనుకునే పనులకి ఈ ఆర్బిటల్ డేటా సెంటర్లు బాగా సెట్ అవుతాయి. ఉదాహరణకు... శాటిలైట్ల నుండి వచ్చే సమాచారాన్ని ప్రాసెస్ చేయడం, రక్షణ రంగం లేదా నిఘా విభాగాల డేటా ప్రాసెసింగ్, స్పేస్ మిషన్ల శాస్త్ర పరిశోధన లాంటి వాటికి ఇవి ఉపయోగపడతాయి.ముఖ్యంగా ఈ మూడూ ఉండాలిక్లౌడ్ కంప్యూటింగ్, వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, శాస్త్ర సాంకేతిక పరిశోధనలు.. వీటన్నిటినీ ప్రస్తుతం నడిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు శక్తిని ఇచ్చేది ఈ డేటా సెంటర్లే. అంటే, డేటా సెంటర్ అనేది కేవలం సర్వర్లతో నిండిన ఒక రూమ్ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువే!మొదటిది విద్యుత్: ఒక డేటా సెంటర్ ఎలాంటి అవాంతరాలూ లేకుండా నడవాలంటే సర్వర్లు, నెట్వర్క్ పరికరాలు, స్టోరేజ్ సదుపాయాలు కావాలి. ఇవన్నీ నడవడానికి పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం. ఏఐ రాకతో విద్యుత్ వాడకం మరింతగా పెరిగిపోయింది.రెండవది కూలింగ్ (చల్లబరచడం): సర్వర్లు వాడుకునే కరెంట్ అంతా చివరకు వేడి రూపంలోనే బయటకు వస్తుంది. ఆ వేడిని గనక వెంటనే బయటకు పంపకపోతే పరికరాలు పాడైపోతాయి. అందుకే ఎయిర్ కండిషనర్లు, చిల్లర్లు, కూలింగ్ టవర్లు ఉంటాయి. చాలా డేటా సెంటర్లలో కంప్యూటర్ల తర్వాత అత్యధిక కరెంట్ ఖర్చయ్యేది ఈ కూలింగ్ కోసమే.మూడవది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: కావలసినంత స్థలం, బిల్డింగులు, బ్యాకప్ పవర్ (జెనరేటర్లు), వాటర్ సిస్టమ్‌లు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, రిపేర్లు చేయడానికి మనుషులు వెళ్లగలిగే సదుపాయం ఉండాలి.కొన్ని సమస్యలూ ఉన్నాయిడేటా సెంటర్ సామగ్రినంతా అంతరిక్షంలోకి చేర్చడానికి వరుసగా రాకెట్లను లాంచ్ చేయాల్సి ఉంటుంది, ఇది కింద ఉన్న జనాలకి నచ్చకపోవచ్చు. ఇప్పటికీ టెక్సస్‌లోని బోకా చికాలో ఉన్న స్పేస్ఎక్స్ లాంచ్ సెంటర్ దగ్గర స్థానిక యాక్టివిస్టులు నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. ఈ రాకెట్ టెస్టుల వల్ల చుట్టుపక్కల పర్యావరణం పాడైపోతుందని వాళ్ల వాదన. ఇక అన్నిటికంటే ముఖ్యంగా... డేటా మొత్తాన్ని భూమికి, అంతరిక్షంలో ఉన్న డేటా సెంటర్లకి మధ్య రేడియో వేవ్స్ లేదా లేజర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. డేటా సైజ్ ఊహించనంతగా పెరిగిపోతుంది.ఈ డేటా సెంటర్లను, వాటి సోలార్ ప్యానెళ్లను, రేడియేటర్లను ఒకేసారి స్పేస్‌లోకి పంపడం కుదరదు. వీటిని విడివిడిగా పంపి, అంతరిక్షంలోనే అసెంబుల్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం స్పేస్‌లోనే రిపేర్లు, అసెంబ్లింగ్ చేయగల కొత్త రకం టెక్నాలజీ కావాలి.మరొక ముఖ్యమైన సమస్య.. హార్డ్‌వేర్ మార్చడం. భూమి మీద అయితే పాతబడిపోయిన సర్వర్లను ప్రతి మూడు నుండి ఐదేళ్లకు ఒకసారి అప్‌గ్రేడ్ లేదా రీప్లేస్ చేస్తుంటారు. కానీ అంతరిక్షంలో ఈ మార్చడాలు, రిపేర్లు చేయడం చాలా కష్టం. ఒకసారి భూ కక్ష్యలోకి పంపిన హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయడం అంటే అపరిమితమైన ఖర్చుతో కూడుకున్న పని. ఒకవేళ ఆ కంప్యూటర్ సిస్టమ్‌ను అప్డేట్ చేయలేకపోతే, అది గడువు తీరటానికి ముందే పనికిరాకుండా పోతుంది. టెక్నాలజీ ఇంత స్పీడ్‌గా మారిపోతున్న ఈ రోజుల్లో... ఇది చాలా పెద్ద ఆర్థికపరమైన భారం.దీనికి తోడు అంతరిక్షంలో ఉండే కఠినమైన వాతావరణం ఇంకో పెద్ద తలనొప్పి. అవి తిరిగే కక్ష్యను బట్టి... రోజులో చాలాసార్లు ఎండ తగిలినప్పుడు విపరీతమైన వేడి, భూమి నీడలోకి వెళ్లినప్పుడు విపరీతమైన చలిని తట్టుకోవాల్సి ఉంటుంది.- సాక్షి స్పెషల్ డెస్క్ -
అవును! దివి నుంచి దివ్యౌషధాలు రాబోతున్నాయి!
మనకు జ్వరం వచ్చినా, జలుబు చేసినా మెడికల్ షాప్‌కి వెళ్లి టాబ్లెట్స్ కొనుక్కుంటాం. ఈ మందులన్నీ భూమి మీద ఉండే ఫ్యాక్టరీలలో తయారవుతాయని మనకు తెలుసు. కానీ, భవిష్యత్తులో మనం వేసుకునే ప్రాణాధార మందులు ‘అంతరిక్షం’ నుండి రాబోతున్నాయి!అవును! సైన్స్, టెక్నాలజీల ప్రపంచంలో ఇప్పుడు ఒక సరికొత్త విప్లవం రానుంది. రాకెట్లను అంతరిక్షంలోకి పంపే ప్రైవేటు కంపెనీలు, ఇప్పుడు అక్కడే మందుల ఫ్యాక్టరీలను కూడా పెట్టడానికి ప్రణాళికలు వేస్తున్నాయి. భూమి మీద గురుత్వాకర్షణ శక్తి వల్ల ఉత్పత్తి చెయ్యటానికి సాధ్యం కాని కొన్ని శక్తిమంతమైన మందులను అంతరిక్షంలో ఉండే శూన్య వాతావరణంలో చాలా సులభంగా తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు! వార్దా స్పేస్ ఇండస్ట్రీస్ అనే ఒక స్టార్టప్ కంపెనీ అయితే ఏకంగా అంతరిక్షంలోనే ఒక ల్యాబ్‌ని ఏర్పాటు చేసి ప్రయోగాలు మొదలుపెట్టేసింది. వ్యోమగాముల సహాయం కూడా లేకుండా, కేవలం కంప్యూటర్ల ద్వారా అంతరిక్షంలో మందులు తయారు చేసి, వాటిని తిరిగి భూమి మీదకు భద్రంగా తీసుకొచ్చే ఈ సరికొత్త టెక్నాలజీ విశేషాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి.అణువుల్లోనే అసలు కీలకంవ్యోమనౌకలు పరిభ్రమించే భూ కక్ష్యలో మందులపై ప్రయోగాలు చేయడంతో పాటు, కొత్త ఔషధాలను తయారు చేయడం కోసం వార్దా స్పేస్ చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా నిజరూపం దాల్చుతున్నాయి. అందులో కనుక వారు సఫలమైతే, కొత్త మందుల తయారీలో ఇదొక విప్లవాత్మక అడుగు అవుతుంది. అంతేకాకుండా, భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రంగా సాగే సరికొత్త ఉత్పత్తి రంగానికి ఇది నాంది పలుకుతుంది. అరుదైన శ్వాసకోశ వ్యాధులకు చికిత్సలు అందించడంలో, అవయవ మార్పిడి రంగంలో పేర్గాంచిన ‘యునైటెడ్ థెరప్యూటిక్స్’ అనే బయోటెక్ కంపెనీతో తాము చేతులు కలిపినట్లు వార్దా సంస్థ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. లాస్ ఏంజెలెస్ కౌంటీకి చెందిన ‘వార్దా’ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా అంతరిక్షంలోకి చిన్న ‘ప్రయోగ పరికరాల పెట్టెలను’ (పేలోడ్స్) పంపుతోంది. కేవలం అంతరిక్షంలోని గురుత్వాకర్షణ లేని స్థితిలో మాత్రమే చేయగల కొన్ని ఆటోమేటెడ్ ప్రయోగాల సాంకేతికతను అభివృద్ధి చేయడం కోసం వార్దా పరిశోధకులు ఈ పని చేస్తున్నారు. ‘ఆటోమేటెడ్’ అంటే కంప్యూటర్లు, రోబోలు లేదా ముందే సెట్ చేసి పెట్టిన మిషన్ల ద్వారా వాటికవే పనిచేయటం! యాంటీబయాటిక్స్ నుండి కార్టికోస్టెరాయిడ్స్ వరకు మనం వాడే రకరకాల మందులకు మూలాధారమైన కొన్ని రకాల చిన్న అణువులను మార్చటం కూడా ప్రయోగాలలో భాగంగా ఉన్నాయి.‘‘ఆశ్చర్యకరంగా, ఇలాంటి చిన్న అణువుల ప్రయోగాలకు అంతరిక్షం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అంతరిక్షంలో వీటితో సరికొత్త స్ఫటిక విత్తనాలను (క్రిస్టల్ సీడ్స్) తయారు చేసి, వాటిని తిరిగి భూమిపైకి తీసుకురావచ్చు’’ అని వార్దా సంస్థ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మైకేల్ రీలీ అంటున్నారు.సెలైన్‌కు బదులు ‘షాట్స్’!యునైటెడ్ థెరప్యూటిక్స్ సంస్థ ప్రాథమికంగా తన చిన్న అణువుల మందులను వార్దా సాంకేతికత ద్వారా అంతరిక్షంలో పరీక్షించబోతోంది. అయితే భవిష్యత్తులో ఈ సాంకేతికత కేవలం ఆ కంపెనీ మందులకే పరిమితం కాకుండా, ‘మోనోక్లోనల్ యాంటీబాడీస్’ వంటి ఇతర బయోటెక్నాలజీ మందులకు కూడా ఉపయోగపడుతుందని ఆయన నమ్ముతున్నారు. దీనివల్ల ప్రస్తుతం హాస్పిటల్లో నరాల ద్వారా సెలైన్ బాటిల్‌తో ఇచ్చే ఇంజెక్షన్లను, భవిష్యత్తులో చర్మం కింద సులభంగా ఇచ్చే చిన్న సూదులు (సబ్‌క్యుటేనియస్ షాట్స్) గా మార్చవచ్చు.భూమిపై ఏమాత్రం సాధ్యం కాని పరిస్థితులలో, అంతరిక్ష వాతావరణాన్ని ఉపయోగించుకుని ఔషధాలకు అవసరమైన స్పటికాలను తయారు చేయడమే వార్దా కంపెనీ ముఖ్య ఉద్దేశం. ‘‘అంతరిక్షంలో మనం భూమి కంటే పెద్దవిగా, ఎటువంటి లోపాలు లేనివిగా, ఒకే పరిమాణంలో ఉండే స్ఫటికాలను తయారు చేయవచ్చు’’ అని యూఎస్‌లోని బట్లర్ యూనివర్సిటీ రసాయన శాస్త్రవేత్త యాన్ విల్సన్ చెబుతున్నారు. ఆమె గతంలో అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్) కోసం ప్రయోగాలు రూపొందించారు.అంతరిక్షంలో ప్రత్యేకమైన భౌతిక నిర్మాణాలు గల స్పటికాలను సృష్టించవచ్చని యాన్ నిర్థారించారు. ‘‘ఇటువంటి ప్రయోగాల ద్వారా అత్యంత విలువైన గుణాలు కలిగిన మందులను తయారు చేయటం నిస్సందేహంగా సాధ్యమౌతుంది. ఉదాహరణకు, ఒక మందును శరీరంలో త్వరగా కరిగేలా చేయడం ద్వారా, రోగి తక్కువ డోసులు వేసుకుంటే సరిపోయేలా చేయవచ్చు. దీనివల్ల మందుల ఖర్చు కూడా బాగా తగ్గుతుంది’’ అని విల్సన్ వివరించారు.‘పెంటగాన్’ సహకారం!అంతరిక్ష ప్రయోగాలకు అయ్యే ఖర్చులను తగ్గించుకోవడానికి వార్దా సంస్థ కేవలం మందుల ప్రయోగాలే కాకుండా, అమెరికా రక్షణ శాఖకు (పెంటగాన్) సంబంధించిన కొన్ని రక్షణ ప్రయోగాల పరికరాలను కూడా వారి ఆర్థిక సహాయంతో అంతరిక్షానికి తీసుకెళుతున్నట్లు వార్దా చీఫ్ రీలీ వెల్లడించారు. ఎలాన్ మస్క్ ‘స్పేస్–ఎక్స్’ సంస్థ తయారు చేసిన ‘మళ్లీ మళ్లీ వాడగలిగే రాకెట్ల’ (రీయూజబుల్ రాకెట్ల)వల్ల గత పదేళ్లలో అంతరిక్షంలోకి వస్తువులను పంపే ఖర్చు తగ్గినప్పటికీ, అది ఇప్పటికీ చాలా ఖరీదైన వ్యవహారమే. అందుకే వార్దా, ఇతర అంతరిక్ష కంపెనీలు నిరంతరం పెంటగాన్ వంటి కొత్త కస్టమర్ల కోసం వెతుకుతూనే ఉంటాయి. నిజానికి వార్దా కంటే కూడా ‘అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ’ను తమకు అనుకూలంగా మార్చుకోవటానికి ఫార్మా రంగమే అత్యంత ఆసక్తిగా ఉంది. ‘‘ఎందుకంటే మందుల మార్కెట్ చాలా పెద్దది. ఇక మందుల తయారీకి అవసరమయ్యే ముఖ్యమైన రసాయన పదార్థాల బరువు చాలా తక్కువగా ఉంటుంది’’ అని ప్రైవేట్ అంతరిక్ష రంగాన్ని పరిశోధించే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పరిశోధకుడు మాథ్యూ వీంజియర్ల్ అంటారు.త్వరలో కొత్త ఐ.ఎస్.ఎస్.లుచాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు భూకక్ష్యలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, చైనాకు చెందిన ‘తియాంగాంగ్’ పరిశోధనా కేంద్రాలకు తమ ప్రయోగాల పరికరాలను పంపుతున్నారు. కానీ, వ్యోమగాముల సహాయం అవసరం లేకుండా, ఆటోమేటిక్‌గా అంతరిక్షంలో ప్రయోగాలు జరిపించే సామర్థ్యం ప్రస్తుతం కేవలం వార్దా, స్పేస్–ఎక్స్ కంపెనీలకు మాత్రమే ఉందని రీలీ తెలిపారు.ఇక 2030లో కాల పరిమితి తీరబోతున్న ఐ.ఎస్.ఎస్. స్థానంలో సరికొత్త ప్రైవేట్ అంతరిక్ష కేంద్రాలు రాబోతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్నది కమర్షియల్ స్పేస్ స్టేషన్ల యుగం కాబట్టి మరిన్ని కొత్త టెక్నాలజీలు రావచ్చు. ఉదాహరణకు, ‘స్పేస్ టాంగో’, ‘వాయేజర్ టెక్నాలజీస్’ వంటి కంపెనీలు అంతరిక్షంలో ప్రయోగాలు చేసుకోవడానికి ప్లగ్–అండ్–ప్లే (సులభంగా వాడుకోగలిగే) సేవలను ఇప్పటికే అందిస్తున్నాయి. వాయేజర్ టెక్నాలజీస్ సంస్థ ‘స్టార్లాబ్’ పేరుతో ఒక సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే పనిలో ఉంది. ఈ కొత్త ప్రాజెక్టులన్నీ ఫార్మా రంగాన్ని దృష్టిలో పెట్టుకునే రూపొందుతున్నాయని వీంజియర్ల్ తెలిపారు. మరోవైపు వార్దా సంస్థ కూడా మరిన్ని కొత్త భాగస్వామ్యాల కోసం, అలాగే ప్రయోగాల వేగాన్ని పెంచడానికి ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం మూడు నెలలకు ఒకసారి చేసే ప్రయోగాలను, భవిష్యత్తులో రెండు నెలలకు ఒకసారి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.కదిలే స్పేస్ ఫ్యాక్టరీవార్దా సంస్థ తను రూపకల్పన చేసిన అంతరిక్ష మందుల ల్యాబ్‌కు ‘వినెబాగో’ అని నామకరణం చేసింది. ఇది దాదాపు 300 కిలోగ్రాముల బరువున్న ఒక శాటిలైట్. రాకెట్ ద్వారా దీనిని అంతరిక్ష కక్ష్యలోకి చేరిన తర్వాత, ఈ వినెబాగో తన సొంత ఇంధన ఇంజిన్ సహాయంతో సరైన దిశలోకి మారుతుంది. ఈ శాటిలైట్ లోపల ప్రయోగాలు చేయడానికి ఒక చిన్న క్యాప్సూల్ (పెట్టె వంటి నిర్మాణం) ఉంటుంది. కాగా, ‘వినెబాగో’ అనే మాటను వార్దా, అమెరికాలో ప్రసిద్ధి చెందిన ‘వినెబోగో మోటార్హోమ్స్’ అనే పేరు నుండి స్వీకరించింది. వినెబాగో మోటార్హోమ్స్ అనేవి ప్రయాణించే ఇళ్లలాగే అన్ని వసతులను కలిగి ఉంటాయి. వార్దా కూడా ‘కదిలే స్పేస్ ఫ్యాక్టరీ’ అనే అర్థంలో వినెబాగో పేరును తన స్పేస్ ల్యాబ్‌కు పెట్టుకుంది. ఆ ల్యాబ్‌లో ప్రయోగాలు పూర్తయిన తర్వాత, ఆ క్యాప్సూల్ గంటకు సుమారు 18,000 మైళ్ల వేగంతో తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. చివరకు పారాషూట్ సహాయంతో ఆస్ట్రేలియాలోని నిర్జన ప్రాంతంలో ల్యాండ్ అవుతుంది. ఇంతకు మించి, మరే వివరాలూ వార్దా ఇప్పటికైతే వెల్లడించలేదు.2024లో ఈ కంపెనీ తయారుచేసిన మొదటి నమూనా క్యాప్సూల్‌ను అమెరికాలోని ఉటా ఎడారిలో దించాలని ప్లాన్ చేశారు. కానీ అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మొదట్లో అనుమతి నిరాకరించడం వల్ల అది భూమికి తిరిగి రావడం ఆలస్యమైంది. ఈసారి అలా జరగకుండా ఉండేందుకు ఆస్ట్రేలియాలో ల్యాండ్ చేస్తున్నారు.గేమ్ ఆఫ్ ఛాన్స్?! అంతరిక్షంలో మందుల తయారీకి మంచి అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న పని అని న్యూజెర్సీలోని రోవాన్ యూనివర్సిటీకి చెందిన కెమికల్ ఇంజనీర్ గెరార్డ్ కాపెల్లాడెస్ అంటున్నారు. ఆయన చెబుతున్న దానిని బట్టి ఈ ప్రయోగాలలో కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఉన్నాయని అర్థమౌతోంది.మొదటిది, పరిమాణం సమస్య. అంతరిక్షంలో పెంచిన స్పటికాలను విత్తనాలుగా ఉపయోగించి, వాటి సహాయంతో భూమిపై పెద్ద ఎత్తున మందులను తయారు చేయడానికి పరిశోధకులు ప్రయత్నించాలి. లేదా ఫార్మా రంగం వెలుపల ఉండే ఇతర అత్యంత విలువైన రంగాల కోసం ఒకే ఒక పరిపూర్ణమైన స్ఫటికాన్ని వృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి. ఇది ఎందుకు సవాలు అవుతుందంటే, అంతరిక్షంలోకి భారీ ఫ్యాక్టరీ సామగ్రిని పంపలేం. రాకెట్లలో చాలా తక్కువ బరువులను, చిన్న పెట్టెలను మాత్రమే పంపగలం. ల్యాబులో గ్రాముల లెక్కన మందులు తయారు చేయటం తేలికే. కానీ ప్రపంచంలో ఉన్న రోగులందరికీ సరిపడా కిలోలు, లేదా టన్నుల కొద్దీ మందులు అంతరిక్షంలో తయారు చేయటం ప్రస్తుతానికైతే కష్టం.రెండవది, ప్రయోగం జరిగే వాతావరణాన్ని మన అధీనంలో ఉంచుకోవడం చాలా కష్టం. తక్కువ ఖర్చుతో, అనుకున్న సమయానికి కచ్చితమైన స్ఫటిక నిర్మాణాన్ని సాధిస్తామని గ్యారంటీ ఇవ్వడం చాలా కష్టం. ఈ ప్రయోగాలను ఆయన ఒక ‘గేమ్ ఆఫ్ ఛాన్స్’గా అభివర్ణించారు. అంటే అంతా అదృష్టంపై ఆధారపడి ఉందని! ‘‘ఒకే రకమైన వాతావరణం ఉన్నప్పటికీ, కొన్నిసార్లు స్ఫటికం ఏర్పడటానికి కేవలం నిమిషాల సమయం పడుతుంది, మరికొన్నిసార్లు వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు’’ అని గెరార్డ్ అంటారు. అయితే, భవిష్యత్తులో దీని ఖర్చులు తగ్గుతాయని, ఈ ప్రయోగాలను కొనసాగించడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.ఫార్మారంగం నక్కను తొక్కినట్లే!వార్దా, యునైటెడ్ థెరప్యూటిక్స్ సంస్థల భాగస్వామ్యం విజయవంతమై, ఇదొక మంచి ఉదాహరణగా నిలవాలని వీంజియర్ల్ ఆశిస్తున్నారు. ఇది గనుక సఫలమైతే, ఒక డోమినో ఎఫెక్ట్ (ఒకదాని వెనుక ఒకటిగా జరిగే మార్పు)ను సృష్టిస్తుంది. అంటే, దీనిని చూసి భవిష్యత్తులో మరిన్ని ఫార్మా కంపెనీలు అంతరిక్ష సంస్థలతో జతకడతాయి. ‘‘ఈ భాగస్వామ్యం ద్వారా మార్కెట్లో సూపర్ హిట్ అయ్యే ఒకటి రెండు మందులు గనుక తయారైతే, అది అంతరిక్షంలో పెద్ద ఎత్తున లాభసాటి వ్యాపారాలు చేయడానికి ఫార్మా రంగానికి ఒక అద్భుతమైన బాటలు వేస్తుంది’’ అని ఆయన నమ్మకంగా చెబుతున్నారు.వీంజియర్ల్ ఆశాభావాన్ని బట్టి భూమిపై నయం చేయలేని ఎన్నో రోగాలకు అంతరిక్షం వేదికగా తక్కువ ఖర్చుతో కూడిన, మరింత శక్తిమంతమైన మందులు అందుబాటులోకి వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది. - సాక్షి స్పెషల్ డెస్క్ -
జాబిలితో నాసా అష్టావధానం!
అర్ధ శతాబ్దం తర్వాత చందమామ చెంతకు మానవసహిత యాత్ర చేపట్టబోతోంది నాసా. వాతావరణం అనుకూలిస్తే అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 8న ‘స్పేస్ లాంచ్ సిస్టమ్’ (ఎస్ఎల్ఎస్)కు చెందిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్ గాల్లోకి లేస్తుంది. 32 అంతస్తుల ఎత్తుండే ఈ భారీ ఆ రాకెట్లో అతి శీతల ద్రవ ఆమ్లజని, ద్రవ ఉదజనితో కూడిన 26.5 లక్షల లీటర్ల ఇంధనం వాడబోతున్నారు. 53 ఏళ్ల క్రితం 1972లో నిర్వహించిన ‘అపోలో 17’ మిషన్ తర్వాత నాసా చేపడుతున్న తొలి మానవసహిత చంద్రయాత్ర ఇది. నలుగురు అమెరికన్ వ్యోమగాములు రీడ్ వైస్ మాన్ (కమాండర్), విక్టర్ గ్లోవర్ (పైలట్), క్రిస్టినా కోచ్ (మిషన్ స్పెషలిస్ట్), జెరెమీ హాన్సెన్ (మిషన్ స్పెషలిస్ట్) చంద్రకక్ష్యలోకి వెళ్లి తిరిగిరానున్నారు. ప్రస్తుతానికి వీరు జాబిల్లిపై దిగబోవడం లేదు. చంద్రుడి చుట్టూ ‘ఓ రౌండ్’ కొడతారు. చంద్రుడి ఆవలి వైపునకు వెళతారు. ఆ సందర్భంలో వారికి భూమి కొంతసేపు అదృశ్యమవుతుంది. అంతేకాదు... 40 నిమిషాలపాటు వారికి భూమితో సమాచార సంబంధాలు తెగిపోతాయి. అన్ని కమ్యూనికేషన్స్ కట్ అవుతాయి. భూమితో రియల్ టైమ్ కాంటాక్ట్స్ ఉండవు. అంటే డీప్ స్పేస్ ఐసోలేషన్‌లో ఉండిపోతారు! భూమి నుంచి బయల్దేరి తిరిగొచ్చేవరకు ఈ చంద్రయాత్రకు దాదాపు పది రోజులు పడుతుంది. భూకక్ష్యకు చేరగానే రాకెట్ నుంచి విడివడి నాసా ఆస్ట్రోనాట్లు వ్యోమనౌక ‘ఆరియన్’లో ప్రయాణం కొనసాగిస్తారు. భూమి నుంచి చంద్రుడి వరకు వారి యాత్ర సరళరేఖా మార్గంలో ఉండదు. వ్యోమనౌక పయనించే పథం ‘8 అంకె’ ఆకారంలో ఉంటుంది. ఈ పయన మార్గం నౌకను చంద్రుడి ఆవలి వైపునకు పట్టుకెళ్లడమే కాకుండా తిరిగి సురక్షితంగా భూమికి తీసుకొస్తుంది. దీన్ని ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ అంటారు. వ్యోమగాములు తొలుత భూమి చుట్టూ అత్యున్నత దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఒక రోజు గడుపుతారు. ‘ఆరియన్’ నౌకలోని జీవనాధార వ్యవస్థలు సరిగా పనిచేస్తున్నాయో, లేదో ఈ వ్యవధిలో తెలిసిపోతుంది. ఈ సమయంలో ఏదైనా సమస్య తలెత్తితే వారు భూమి సమీపంలోనే ఉంటారు కనుక వెంటనే క్షేమంగా తిరిగి వచ్చేయవచ్చు. 24 గంటల తర్వాత కూడా నౌకలో అన్ని వ్యవస్థలు సవ్యంగా పనిచేస్తున్నాయని ధృవీకరించుకున్నాక వారు ముందుకు సాగి నాలుగు రోజులకు చంద్రుడి కక్ష్యకు చేరతారు. చంద్రుడి గురుత్వశక్తిని ఉపయోగించుకుని వ్యోమనౌక మనకు కనిపించని జాబిలి ఆవలి వైపునకు వెళ్లడమే కాకుండా... తిరుగు ప్రయాణానికి అవసరమైన ఇంజిన్లను మండించకుండానే భూమి వైపు మళ్లగలదు. అంటే.. చంద్రయాత్రలో భూమిని విడిచిపెట్టాక ‘ఆరియన్’ వ్యోమనౌక చోదక వ్యవస్థలో ఏదైనా సమస్య ఉత్పన్నమై ఇంజిన్ పూర్తిగా విఫలమైనా ఆందోళన చెందనక్కర్లేదు. భౌతికశాస్త్ర సూత్రాలే భూ, చంద్రుల గురుత్వశక్తుల రూపంలో వ్యోమగాముల పాలిత సహజ రక్షాకవచాలుగా నిలిచి వారికి భద్రత కల్పిస్తాయి! గురుత్వశక్తే వారిని తిరిగి క్షేమంగా భూ వాతావరణంలోకి రప్పిస్తుంది. అంతరిక్షంలో వ్యోమనౌక ప్రయాణించే ‘8’ అంకె ఆకృతిలోని పథ విశేషం ఇదే. ఈ యాత్రలో వ్యోమగాములు చంద్రుడి ఆవలి (వెనుక) వైపున చంద్రుడి ఉపరితలం నుంచి 4,700 మైళ్ళ దూరంలో ప్రయాణిస్తారు. ఆ సందర్భంగా భూమి నుంచి ఇప్పటివరకు అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన వ్యక్తులుగా వారు రికార్డు నెలకొల్పనున్నారు. చంద్రుడిపై దిగనప్పటికీ వారు భారీ గోతులమయమైన దాని ఉపరితలాన్ని దగ్గరిగా వీక్షిస్తారు. అలాగే ఉదయిస్తున్న భూమిని తిలకిస్తారు. చివర్లో ‘ఆరియన్’ క్రూ కేప్సూల్ గంటకు 40 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఆ వేగంలో గాలి రాపిడికి నౌక వెలుపల 2,760 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి జనిస్తుంది. అంత తీవ్రమైన వేడిని తట్టుకోవడం నౌక ఉష్ణ రక్షాకవచం (హీట్ షీల్డ్)కు ఓ అగ్నిపరీక్ష. అనంతరం పారాచూట్ల సాయంతో కేప్సూల్ నిదానంగా పసిఫిక్ మహాసముద్రంలో దిగుతుంది. వ్యోమగాములు లేకుండా ‘ఆర్టెమిస్-1’తో 2022లో మానవరహిత యాత్ర నిర్వహించి ‘ఆరియన్’ నౌక సన్నద్ధతను నాసా పరీక్షించింది. అప్పుడు కేప్సూల్ పసిఫిక్ మహా సంద్రంలో సురక్షితంగా దిగినప్పటికీ దాని హీట్ షీల్డ్ దెబ్బతిన్నట్టు అనంతర తనిఖీల్లో ఇంజినీర్లు గుర్తించారు. అయితే కేప్సూల్ లోపలి భాగానికి ఏమీ కాలేదు. అన్నీ సవ్యంగా సాగితే 2028లో చేపట్టే ‘ఆర్టెమిస్-3’ యాత్రతో జాబిల్లి దక్షిణ ధృవంపై నాసా వ్యోమగాములు దిగుతారు. చైనా కూడా ఈ విషయంలో అమెరికాతో తీవ్రంగా పోటీ పడుతోంది. 2030లో చంద్రుడిపై తమ వ్యోమగాములను దింపే దిశగా అది ప్రణాళికలు రచిస్తోంది. ద్రవ ఉదజని ఇంధనం లీక్... నాసా చంద్రయాత్ర మార్చికి వాయిదా!ఇంధన ట్యాంకు నుంచి లీకవుతున్న ద్రవ హైడ్రోజన్. దీంతో ‘ఆర్టెమిస్-2’ ప్రయోగాన్ని మార్చి నెలకు వాయిదా వేసిన నాసా. నలుగురు వ్యోమగాములు ప్రయాణించే ‘ఆరియన్’ వ్యోమనౌకను భూకక్ష్యకు చేర్చాల్సిన ఎస్ఎల్ఎస్ భారీ రాకెట్లో ఇంధనంగా క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ వాడతారు. ఈ రాకెట్ ఇంధన ట్యాంకుల్లో అతి శీతల ద్రవరూప హైడ్రోజన్ 20 లక్షల లీటర్లు, ఆక్సిజన్ 7 లక్షల లీటర్లు వినియోగిస్తారు. రాకెట్ అడుగు భాగం వద్ద ద్రవ ఉదజని లీకవుతున్నట్టు సెన్సర్లు గుర్తించడంతో ప్రయోగం వాయిదాపడింది. వాతావరణం అనుకూలించే దాన్ని బట్టి ఈ ఏడాది మార్చి 6, 7, 8, 9, 11 తేదీల్లో గానీ లేదా ఏప్రిల్ 1, 3, 4, 5, 6, 30 తేదీల్లో గానీ ఏదో ఒక రోజు ప్రయోగం జరిగే అవకాశముంది.(NASA, Interstellar Traveller, Space.com, BBC Sky at Night Magazine, India Today, News 18, El Mundo America, CBS News, WION, The Times of India).-జమ్ముల శ్రీకాంత్. -
మనకూ సొంత స్పేస్ స్టేషన్
గుజరాత్ నుంచి సాక్షి ప్రతినిధి : ‘సొంత అంతరిక్ష కేంద్రాలు కలిగిన దేశాల సరసన త్వరలో భారత్ నిలవనుంది. 2028లో భారతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణం షురూ అవ్వనుంది’ అని ఇస్రోలో భాగమైన అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ) డైరెక్టర్ నీలేశ్ ఎం.దేశాయ్ తెలిపారు. స్వదేశీ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి ఐదు రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి విడి భాగాలు పంపాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా 2028లో తొలి రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. 2035 నాటికి విడి భాగాలన్నింటినీ అంతరిక్షంలోకి చేర్చి ఇంటిగ్రేషన్ పూర్తి చేస్తామన్నారు. దీంతో భవిష్యత్తులో రోదసీ యాత్ర చేసే వ్యోమగాములు స్వదేశీ అంతరిక్ష కేంద్రంలో దిగి చంద్రుడి మీదకు వెళ్తారని చెప్పారు. ఎస్ఏసీ పనితీరు గురించి నీలేశ్ ఎం.దేశాయ్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 2027లో మానవ సహిత ప్రయోగం మానవ రహిత అంతరిక్ష ప్రయోగం దిశగా ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) వేగంగా అడుగులు వేస్తోంది. గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా తొలుత నాలుగు మానవ రహిత ప్రయోగాలు చేయాలని ఇస్రో నిర్ణయించింది. 2026 ఫిబ్రవరిలో తొలి ప్రయోగం చేపట్టబోతున్నాం. 2026లోనే మరో రెండు, 2027లో చివరి ప్రయోగం పూర్తి చేస్తాం. అదే ఏడాది ఆఖరులో మానవ సహిత ప్రయోగం పూర్తి చేస్తాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా 2022లోనే గగన్‌యాన్ పూర్తి చేయాల్సి ఉంది. కరోనా, ఇతర సాంకేతిక కారణాలతో ప్రయోగం వాయిదా పడింది. గగన్‌యాన్ యాత్రకు వ్యోమగాములుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నలుగురు కెపె్టన్లను ఎంపిక చేశాం. వీరిలో ఒకరైన శుభాన్షు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి తిరిగి వచ్చారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు తిరిగి ఎయిర్ ఫోర్స్‌కు వెళ్లగా, ఇద్దరు శిక్షణలో కొనసాగుతున్నారు. 2027లో గగన్‌యాన్‌లో ఎంత మంది వ్యోమగాములు రోదసీ యాత్ర చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇద్దరు వ్యోమగాములు ఉంటే మంచిదని భావిస్తున్నాం. వ్యోమగాములు సురక్షితంగా అంతరిక్ష యాత్ర చేసి, తిరిగి వచ్చేందుకు వీలుగా వాహక నౌకను తీర్చి దిద్దుతున్నాం. డీఆర్డీఏ, ఇతర స్వతంత్ర సంస్థలు నౌకను సర్టిఫై చేస్తాయి. స్వదేశీ సాంకేతికతతో సెమీ కండక్టర్ల తయారీ సెమీ కండక్టర్లలో స్వయం సమృద్ధి సాధనే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. ఇస్రో కార్యకలాపాలకు సెమీ కండక్టర్లు కీలకమైనవి. ఇస్రో అవసరాల కోసం సెమీ కండక్టర్లు బయట నుంచి కొనే పని లేకుండా చేస్తున్నాం. అంతే కాకుండా బయటి సంస్థల అవసరాలకూ సెమీ కండక్టర్లు సరఫరా చేస్తున్నాం. ఎస్‌ఏసీలో దేశంలోనే మొదటి సారిగా పూర్తి స్వదేశీ సాంకేతికతతో సెమీ కండక్టర్లు తయారు చేస్తున్నాం. ఈ సాంకేతికను వాడుకోవడానికి ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తున్నాయి. సెమీ కండక్టర్ల విషయంలో ఎంతో చిన్న దేశమైన తైవాన్‌పై ప్రపంచం మొత్తం ఆధారపడి ఉంది. ఎస్ఏసీ ఎంతో విభిన్నం ఇస్రోలో భాగమైన మిగిలిన సంస్థలతో పోలిస్తే ఎస్ఏసీ ఎంతో విభిన్నమైంది. ఉపగ్రహ పేలోడ్లను ప్రజలు, ప్రభుత్వం, సమాజానికి ఉపయోగకరమైన కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, నావిగేషన్, దేశ రక్షణ, జాతీయ ప్రయోజనం కోసం అభివృద్ధి చేయడంలో ఎస్ఏసీకి ప్రత్యేకత ఉంది. దేశంలో వాతావరణాన్ని అంచనా వేయడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. అంతరిక్షంలోని శాటిలైట్ వ్యవస్థ ద్వారా 15 రోజుల ముందే వాతావరణ పరిస్థితులను అంచనా వేసి, సమాచారాన్ని ఐఎండీకి చేరవేస్తున్నాం. దీంతో తుపానులు, ఇతర ప్రకృతి విపత్తుల పట్ల ప్రభుత్వాలు అప్రమత్తం అవుతాయి. -
పరీక్ష చేస్తుండగా.. పేలిపోయిన జపాన్ రాకెట్ ఇంజిన్
టెక్నాలజీ పరంగా జపాన్ ఎంతో అభివృద్ది చెందింది. అంతరిక్ష ప్రయోగాల విషయంలోనూ అగ్రదేశాలకు పోటీనిస్తూ వస్తోంది ఈ దేశం. అంతటి పేరు ప్రఖ్యాతులున్న జపాన్‌కు అంతరిక్ష ప్రయోగాల పరంగా మరోసారి అపజయమే ఎదురైంది. జపాన్‌కు చెందిన అంతరిక్ష సంస్థ అభివృద్ది చేస్తున్న ఒక రాకెట్ ఇంజిన్ పరీక్ష సమయంలో పేలిపోయింది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు. రెండో దశ ఇంజిన్‌కు సంబంధించిన గ్రౌండ్ టెస్ట్ ప్రారంభమైన ఒక నిమిషం తర్వాత ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. అసలేం జరిగిందంటే.. ఖ్యుషు దీవిలో యుచినోరా స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.50 నిమిషాలకుఎప్సిలాన్-6 రాకెట్ రాకెట్ ఇంజిన్‌ను పరీక్షిస్తుండగా పేలిపోయింది. ఈ పేలుడు గురించి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ ఉదయం 9.57 గంటలకు అధికారికంగా ప్రకటించింది. అకిటా ప్రిఫెక్చర్‌లోని నోషిరో టెస్టింగ్ సెంటర్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ ప్రకారం, పెరుగుతున్న ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంపొందించడానికి ప్రస్తుత ఎప్సిలాన్ సిరీస్‌కు వారసుడిగా ఎప్సిలాన్ S ను అభివృద్ధి చేస్తోంది. గత ఏడాది ప్రయోగించినప్పుడు విఫలమైన ఎప్సిలాన్-6 రాకెట్‌ను అభివృద్ధి చేసి ‘ది ఎప్సిలాన్-ఎస్ పేరిట జపాన్ సిద్ధం చేసింది. ఇప్పుడు ఆ రాకెట్ పరీక్షల దశలో పేలిపోయింది. పేలుడు అనంతరం ఉత్తర ఆకితా ప్రాంతంలోని ఈ పరీక్షా కేంద్రం పరిసరాల్లో భారీ ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. చదవండి గూగుల్ మ్యాప్‌ను వినియోగిస్తూ.. ఆ గొంతు తెలియదంటే ఎలా? -
Nasa: చంద్రుడిపైకి మళ్లీ.. ఈసారి ఏకంగా..!
వాషింగ్టన్: అంతరిక్ష పరిశోధనలో భాగంగా నాసా శాస్త్రవేత్తలు మళ్లీ చంద్రునిపై కాలుపెట్టనున్నారు. ఈసారి.. చంద్రుడిపై ప్రయోగాల సందర్భంగా వ్యోమగాములు తరచూ వినియోగించుకునేందుకు వీలుగా చందమామ సమీప కక్ష్యలో కొత్త అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఏ కక్ష్య అనువుగా ఉంటుందో విషయాన్ని నిర్ధారించేందుకు మంగళవారం క్యాప్‌స్టోన్ అనే ఒక బుల్లి ఉపగ్రహాన్ని పంపారు. ఒక మైక్రోవేవ్ పరిమాణముండే 25 కేజీల ఈ కృత్రిమ శాటిలైట్‌ను మోసుకెళ్లే రాకెట్‌ను న్యూజిలాండ్ నుంచి ప్రయోగించారు. క్యాప్‌స్టోన్ చందమామ సమీపానికి చేరుకుని దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఆ క్రమంలో చంద్రుడికి దగ్గరగా వచ్చినపుడు 2,200 మైళ్లదూరంలో, దూరం జరిగినపుడు 44 వేల మైళ్ల దూరంలో ఉంటుంది. ఇలాంటి కక్ష్యలో పరిభ్రమించనున్న తొలి కృత్రిమ ఉపగ్రహంగా చరిత్ర సృష్టించనుంది. ఆర్నెల్ల పాటు శోధించి అక్కడి స్పేస్‌స్టేషన్ నిర్మాణ అనుకూల కక్ష్యల సమాచారాన్ని నాసాకు చేరవేస్తుంది. భవిష్యత్‌లో ఈ స్పేస్ స్టేషన్ నుంచే వ్యోమగాములు చందమామపై వేర్వేరు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. Liftoff! #CAPSTONE launched aboard a @RocketLab Electron rocket to pave the way for future @NASAArtemis missions to the Moon and beyond. What’s next for the microwave oven-sized satellite? Check out https://t.co/dMVnvEQcfC for updates. pic.twitter.com/VVoAOjSYbD — NASA (@NASA) June 28, 2022 -
Space Solar Plant: ఆకాశం నుంచి కరెంట్!
ఒక్క నిమిషం కరెంటు పోతే.. ఆగమాగం అయిపోతాం. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం విద్యుత్ కావాల్సిందే. ఓ వైపు బొగ్గు వంటి సహజ వనరులు తరిగిపోతున్నాయి. ప్రత్యామ్నాయ విద్యుత్‌కు మరెన్నో కష్టాలు.. ఇలాంటి సమయంలోనే ఆకాశం నుంచే కరెంటు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ భూమ్మీద బొగ్గు తరిగిపోతోంది.. జల విద్యుత్ సరిపోదు.. సౌర విద్యుత్ ఉన్నా.. పగలు మాత్రమే కరెంటు ఉత్ప త్తి అవుతుంది. మబ్బు పట్టినా, ఫలకాలపై దు మ్ముపడినా ఉత్పత్తి తగ్గిపోతుంది. పవన విద్యు త్ వంటి ఇతర మార్గాలు ఉన్నా ఖర్చెక్కువ. నిరంతరంగా ఉత్పత్తి సాధ్యంకాదు. మరె లా అన్న ఆలోచన చేసిన శాస్త్రవేత్తలు.. అంతరిక్షం లో ఉపగ్రహాల తరహాలో భారీ సోలార్ ప్యానె ల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయవచ్చని ప్రతిపాదించారు. జపాన్, యూరోపియన్ యూ నియన్ ఆ దిశగా పరిశోధనలు చేస్తుండగా.. చైనా నేరుగా రంగంలోకి దిగింది. అంతరిక్షంలో అత్యంత భారీ సోలార్ ప్రాజెక్టు చేపట్టే పనిలో పడింది. మరో 14 ఏళ్లలో అంటే 2035 కల్లా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. చదవండి: తాలిబన్ల దమనకాండ అంతరిక్షంలో సోలార్ ప్రాజెక్టు పనిచేసేదిలా.. చైనా ప్రాజెక్టు ఇదీ.. ►భూమికి 23 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ ఏర్పాటుకు చైనా ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. అంటే ఆ ప్లాంట్ భూమి తిరిగే వేగంతోనే కదులుతూ.. ఎప్పుడూ ఒకే ప్రాంతంపై ఉంటుంది. ►ప్రాజెక్టులో భాగంగా 2035 సంవత్సరం నా టికి సుమారు 1.6 కిలోమీటర్ల మేరసోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తారు. ముందు ఒక మెగావాట్ సామర్థ్యంతో మొదలుపెట్టి.. తర్వాత మరింతగా విస్తరిస్తూ వెళతారు. ►2050నాటికి ఒక అణువిద్యుత్ ప్లాంటు స్థాయిలో ఏకంగావెయ్యి మెగావాట్లు ఉత్పత్తి చేసేలా ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ను అభివృద్ధి చేస్తారు. ►ప్రస్తుతం చైనాలోని చోంగ్‌కింగ్ పట్టణం శి వార్లలో ‘బిషన్ స్పేస్ సోలార్ ఎనర్జీ స్టేషన్’ను నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ప్రయోగాన్ని మొదలుపెట్టాలని భావిస్తోంది. ►అయితే ఈ భారీ ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలేమీ వెల్లడించలేదు. చదవండి: అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..! ఖర్చు తక్కువే.. 2039 నాటికి ‘స్పేస్ ప్లాంట్’ ఏర్పాటు చేయాలని బ్రిటన్ను ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా సాధ్యాసాధ్యాలు, ఖర్చుపై ఓ నివేదికను రూపొందించింది. అంతరిక్షంలో ఒక కిలోమీటర్ వెడల్పున ప్లాంట్ ఏర్పాటుకు.. 2 వేల టన్నుల పరికరాలు అవసరమని లెక్కించింది. భూమిపై రిసీవింగ్ స్టేషన్‌ను 95 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని అంచనా వేసింది. ళీ ప్రస్తుతం వెయ్యి యూనిట్ల కరెంటు ఉత్పత్తి కోసం.. అణువిద్యుత్ ప్లాంట్లలో రూ.5 వేలకుపైగా.. భూమ్మీది సౌర, పవన విద్యుత్ ప్లాంట్లలో రూ.3,750 వరకు ఖర్చవుతోందని తెలిపింది. అదే ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ కేవలం రూ.385 మాత్రమే ఖర్చవుతాయని అంచనా వేసింది. ఓ ఫిక్షన్ నవల నుంచి.. ఐజాక్ అసిమోవ్ రష్యన్ రచయిత 1941లో రాసిన సైన్స్ ఫిక్షన్ నవలలో ‘స్పేస్ సోలార్ పవర్ స్టేషన్ల’ గురించి రాశారు. ఆ ప్లాంట్లు సూర్యరశ్మిని మైక్రోవేవ్‌ల రూపంలో వివిధ గ్రహాలపైకి పంపుకొంటారని పేర్కొన్నారు. సోలార్ పవర్ వినియోగం కొత్తగా మొదలైన 1970 దశకంలో కొందరు శాస్త్రవేత్తలు ‘స్పేస్ సోలార్ పవర్’ ప్రతిపాదనలు చేశారు. కానీ అప్పటి పరిస్థితి, భారీ ఖర్చుతో ఏదీ ముందుకుపడలేదు. ఇటీవలి కాలంలో పలు కొత్త టెక్నాలజీలు రావడంతో మళ్లీ పరిశోధనలు మొదలయ్యాయి. ఇప్పటికే బ్రిటన్, జపాన్, రష్యా, అమెరికా, చైనా దేశాలు ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. లాభాలు ఎన్నో? ►సూర్యుడి కిరణాల తీవ్రత, రేడియేషన్ ఎ క్కువగా ఉంటాయి.పైగా దుమ్ముపడి సోలార్ ప్యానెళ్ల సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఉండవు. పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ►భూమ్మీద రోజూ 9–10 గంటల పాటు మాత్రమే సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అది కూడా సోలార్ ప్యానెళ్లపై సూర్యరశ్మి నేరుగా పడే ఐదారు గంటలు మాత్రమే పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదే అంతరిక్షంలో సోలార్ ప్యానెళ్లు పూర్తిగా సూర్యుడివైపే ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. దీనితో రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ►ఈ ప్రత్యామ్నాయ విద్యుత్ కారణంగా.. బొగ్గు, పెట్రోలియం, ఇతర శిలాజ ఇంధనాల వినియోగం నిలిచిపోయి భూమ్మీద కాలుష్యం తగ్గుతుంది. ఆయుధంగా మారుతుందా? జేమ్స్‌బాండ్ సినిమాలో ఓ ప్రైవేటు సంస్థ అంతరిక్షంలో సోలార్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. రాత్రిపూట అవసరమైన చోట వెలుగు ఇవ్వొచ్చని చెప్తుంది. కానీ ఆ వ్యవస్థతో సౌరశక్తిని లేజర్ కిరణాల తరహాలో ఒక దగ్గర కేంద్రీకరించి.. విధ్వంసం సృష్టిస్తుంది. ఇది సినిమాని సీన్ అయినా.. స్పేస్ సోలార్ స్టేషన్లతో అలాంటి ప్రమాదమూ ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతుండటం గమనార్హం. ►కావాలని చేయకపోయినా.. స్పేస్ సోలార్ స్టేషన్లో సమస్య వచ్చి.. అది భూమిపైకి పంపే మైక్రోవేవ్‌లు/లేజర్ కిరణాలు ప్రజలు ఉండే ప్రాంతాలపై పడితే ఎలాగన్న ప్రశ్నలూ వస్తున్నాయి. మైక్రోవేవ్‌ల వల్ల రేడియేషన్ ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ►అయితే ఇలాంటి ప్రమాదాలు ఉండకుండా.. కచ్చితమైన వ్యవస్థలను ఏర్పాటు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కిరణాలు రిసీవింగ్ స్టేషన్ పరిధి దాటి బయట ప్రసరించే పరిస్థితి ఉంటే.. ప్లాంట్ ఆటోమేటిగ్గా ఆగిపోయే ఏర్పాట్లు ఉంటాయని భరోసా ఇస్తున్నారు. -
శిరీష సాహసం గర్వకారణం
సాక్షి, తెనాలి: ‘తాతా...డోంట్ ఫియర్...సక్సెస్‌ఫుల్‌గా తిరిగొస్తాను’ ..అని చెప్పిన మనుమరాలు అంతరిక్ష యానం పూర్తిచేసుకొని విజయవంతంగా తిరిగి రావటం ఎన లేని సంతోషాన్ని కలిగిస్తోందని రోదసీ యాత్ర చేసిన తొలి తెలుగమ్మాయిగా రికార్డు సృష్టించిన బండ్ల శిరీష తాతయ్య రాపర్ల వెంకట నరసయ్య అన్నారు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్‌పోర్టు నుంచి సాగిన అంతరిక్షయాత్ర ప్రత్యక్ష ప్రసారాన్ని తోటి బంధువులతో కలిసి వీక్షించిన దగ్గర్నుంచీ, వెంకటనరసయ్య దంపతుల ఆనందానికి హద్దే లేకుండాపోయింది. మరుసటి రోజంతానూ బంధువులు, మిత్రులు, సన్నిహితుల అభినందనలు అందుకుంటూనే ఉన్నారు. సాయంత్రం తనను కలిసిన విలేకరులతో ఆ ఆనందాన్ని పంచుకున్నారు. ఈనెల ఆరో తేదీన మనుమరాలు శిరీష తనతో ఫోనులో మాట్లాడి, తమకు ధైర్యం చెప్పిన మాటల్ని గుర్తుచేసుకున్నారు. నాలుగేళ్లవరకు తన దగ్గర పెరిగిన శిరీష 1992లో అమ్మానాన్నతో కలిసి అమెరికా వెళ్లిందన్నారు. తిరిగి తొమ్మిదేళ్ల వయసులో 1997లో తెనాలి వచ్చినపుడు పైలట్ కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయటమే కాదు...‘నేను పైలెట్‌నై మిమ్మల్నిద్దర్నీ అమెరికా తీసుకెళతాను తాతయ్యా’ అని చెప్పిందన్నారు. కంటిచూపు కారణంగా అవకాశం మిస్సయినా, తగిన చదువులు చదివి, ప్రైవేటు రంగంలో అవకాశాలను అందిపుచ్చుకుని ఈ స్థాయికి చేరుకుందన్నారు. 2016లో తమ 50వ వివాహ వార్షికోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిందనీ, మళ్లీ 2019లో వచ్చినపుడు తనకు కాబోయే భర్తను శిరీష పరిచయం చేసినట్టు వివరించారు. అంతరిక్ష యాత్ర ముగిశాక తన కుమార్తె, అల్లుడుతో మాట్లాడానని చెప్పారు. శిరీషతో మాట్లాడేందుకు వీలుపడలేదన్నారు. ఏదేమైనా స్త్రీలు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరనీ తన మనుమరాలు సాహసయాత్రతో చాటటం గర్వకారణంగా ఉందన్నారు. తన లక్ష్యాన్ని సాకారం చేసుకున్న తీరు, సాధించిన వైనం యువతకు స్ఫూర్తి కాగలదన్నారు. -
నాసా ఛాలెంజ్.. గెలిస్తే రూ.లక్షలు మీ సొంతం
వాషింగ్టన్: అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన ఓ విషయమై ఔత్సాహికులు లేదా వంటల విషయమై అనుభవజ్ఞులైన వారికి ఓ ఆఫర్ ప్రకటించింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల కోసం తిండి పదార్థాలు ఏం తీసుకెళ్లాలనే విషయం మీరు చెప్పాలి. అంతరిక్షంలో ఆ వాతావరణాన్ని తట్టుకుని పాడవకుండా నెలల పాటు నిల్వ ఉండే ఆహార పదార్థాలు చెబితే మీరు కొన్ని వేల డాలర్లు సొంతం చేసుకోవచ్చు. మార్స్ (అంగారకుడు)పైకి వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు నాసా ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో వ్యోమగాములు అంగారక గ్రహంపై ఉండేందుకు వారికి కావాల్సిన ఆహార పదార్థాలను సిద్ధం చేయడానికి తంటాలు పడుతోంది. ఏ ఆహారం తీసుకెళ్లినా కొన్ని నెలలకు పాడవుతుంది. కానీ వ్యోమగాములకు మూడేళ్ల పాటు ఆహారం నిల్వ ఉండే పదార్థాలను తెలపాలని నాసా సలహాలు ఆహ్వానిస్తోంది. మూడేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో వ్యోమగాముకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో చెప్పిన వారికి 5 లక్షల డాలర్ల బహుమతి ప్రకటించింది. దీనికి ‘డీప్ స్పేస్ ఫుడ్’ చాలెంజ్ అనే పేరు పెట్టారు. స్పేస్ మిషన్లలో వ్యోమగాముల ఆహారానికి సంబంధించి కొత్త వ్యవస్థలు, టెక్నాలజీలను కనుగొనాలని నాసా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. అంగారకుడిపైకి వెళ్లిరావడం కలిపితే కనీసం మూడేళ్లు పడుతుంది. ఈ సుదీర్ఘ యాత్రలో వ్యోమగాములకు ఆరోగ్యకరమైన ఆహారం ఉండాలి. అయితే వారికి అవసరమైన ఆహార పదార్థాలు పంపితే అక్కడి వాతావరణం తట్టుకుంటాయా లేదా నిల్వ ఉంటాయా అనే దానిపై మీమాంస ఏర్పడింది. వారికి కావాల్సినంత ఆహారాన్ని రాకెట్లో పంపే పరిస్థితి కూడా లేదు. దీంతో వారి ఆహారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ‘అల్ట్రా హై కేలరీ చాక్లెట్ బార్లను’ కనుగొన్నారు. అయితే సుదీర్ఘ ప్రయాణానికి అది సరిపడా పంపించాలంటే బరువుతో కూడుకున్నది. అవి పంపిస్తే రాకెట్ బరువు పెరిగి ప్రయోగం వికటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త మార్గాల్లో వ్యోమగాములకు ఆహారం అందించడంపై పోటీ పెట్టారు. వినూత్న ఆలోచనలను తమతో పంచుకోవాలని నాసా పిలుపునిచ్చింది. కొత్త తరహాలో ఆలోచించేవాళ్లు మే 28వ తేదీ వరకు రిజిస్టర్ చేసుకోవచ్చని నాసా సూచించింది. జూలై 30వ తేదీలోపు తన వినూత్న ప్రాజెక్ట్‌లను నాసాకు అందించాలి. టాప్ 20 బృందాలకు ఒక్కొక్కరికి 25 వేల డాలర్ల చొప్పున మొత్తం 5 లక్షల డాలర్లు అందిస్తామని నాసా ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం అమెరికావాసులకు మాత్రమే పరిమితం చేశారు. Landing on Mars is hard. Feeding astronauts nutritious, delicious food for months will be a challenge. 🌎🚀🇲🇭 The @NASAPrize and @csa_asc’s #DeepSpaceFoodChallenge 🏆💰 is here to be won by innovative teams designing food for the next frontier! 👉 https://t.co/zmckWeYk3M https://t.co/YKRSFNftaO — Deep Space Food Challenge (@DeepSpaceFood) February 12, 2021 -
అంతరిక్ష కేంద్రాన్నీ నిర్మించగలం: ఇస్రో ఛీఫ్
ఇండోర్: భారత్‌కు అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే సామర్థ్యముందని అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ కిరణ్ తెలిపారు. అయితే ఇందుకోసం దీర్ఘకాల వ్యూహం, పటిష్టమైన ప్రణాళిక అవసరమన్నారు. ఇండోర్‌లో సోమవారం జరిగిన రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన కిరణ్ కుమార్.. ‘అంతరిక్ష కేంద్రం నిర్మించే సామర్థ్యం మనకుంది. దేశం నిర్ణయం తీసుకున్న రోజు మేం ప్రాజెక్టును స్వీకరిస్తాం. ఇందుకోసం విధి విధానాలను రూపొందించి కావాల్సిన నిధులు, సమయం ఇస్తే చాలు’ అని తెలిపారు. మానవరహిత అంతరిక్ష కేంద్రం వల్ల ఉపయోగమేంటనే అంశంపైనా ఇంకా చర్చిస్తున్నామని అందుకే ఈ దిశగా ఆలోచన చేయలేదన్నారు. వాతావరణ పరిస్థితులు, కమ్యూనికేషన్ నెట్వర్క్ రంగాల్లో విస్తృత పరిశోధనలకోసం మరిన్ని ఉపగ్రహాలను పంపించాల్సిన అవసరం ఉందన్నారు. -
కౌంట్‌డౌన్ షురూ


