భండార్కర్‌ కేసులో మోడల్‌కు జైలుశిక్ష | Imprisonment to Model Preeti Jain | Sakshi
Sakshi News home page

భండార్కర్‌ కేసులో మోడల్‌కు జైలుశిక్ష

Apr 29 2017 3:33 AM | Updated on Sep 5 2017 9:55 AM

భండార్కర్‌ కేసులో మోడల్‌కు జైలుశిక్ష

భండార్కర్‌ కేసులో మోడల్‌కు జైలుశిక్ష

బాలీవుడ్‌ దర్శకుడు మాధుర్‌ భండార్కర్‌పై హత్యాయత్నం కేసులో దోషిగా తేలిన ముంబై మోడల్‌ ప్రీతి జైన్‌కు ముంబై సెషన్స్‌ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది.

ముంబై: బాలీవుడ్‌ దర్శకుడు మాధుర్‌ భండార్కర్‌పై హత్యాయత్నం కేసులో దోషిగా తేలిన ముంబై మోడల్‌ ప్రీతి జైన్‌కు ముంబై సెషన్స్‌ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది. జైన్‌ వెంటనే బెయిల్‌కోసం అప్పీల్‌ చేసుకోవటంతో 4 వారాల బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. ఈ కేసులో ప్రీతికి సహకరించిన నరేశ్‌ పరదేశీ, శివరాం దాస్‌లకూ మూడేళ్ల జైలుశిక్ష విధించింది.

2005లో భండార్కర్‌ను హత్యచేసేందుకు గ్యాంగ్‌స్టర్‌ అరుణ్‌ గావ్లీ సన్నిహితుడు నరేశ్‌ పరదేశీతో రూ.75 వేలకు ప్రీతి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే పరదేశీ పని పూర్తి చేయకపోవటంతో డబ్బులు తిరిగిచ్చేయాలని ఈమె డిమాండ్‌ చేయటంతో ఈ విషయం పోలీసులకు చేరింది. భండార్కర్‌ తనపై అత్యాచారం చేశారని 2004లో కేసు పెట్టిన ప్రీతి 2012లో దాన్ని వాపసు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement