Dalit PHD Student Commited Suicide at IIT-Kanpur hostel - Sakshi
Sakshi News home page

పీహెచ్‌డీ దళిత విద్యార్థి ఆ‍త్మహత్య కలకలం

Apr 19 2018 10:09 AM | Updated on Nov 9 2018 5:06 PM

IIT-Kanpur Student Pursuing Ph.D Course Allegedly Committed Suicide - Sakshi

ఐఐటీ కాన్పూర్‌ అంబులెన్స్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, కాన్పూర్: ప్రముఖ ఐఐటీలో పీహెచ్‌డీ చదువుతున్న దళిత విద్యార్థి ఆ‍త్మహత్య  కలకలం రేపింది.  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్‌లోని మూడో సంవత్సరం పీహెచ్‌బీ విద్యార్ధి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన హాస్టల్ గదిలో  ఉరి వేసుకుని చనిపోయాడు. మృతుడిని భీమ్‌సింగ్‌గా పోలీసులు గుర్తించారు.  ఆత్మహత్యకు గలకారణాలు ఇంకా తెలియ రాలేదు.  సూసైడ్  నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు  దర్యాప్తు మొదలుపెట్టారు. 

సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అఖిలేష్ కుమార్ మాట్లాడుతూ ఆత్మహత్యకు కారణాలు స్పష్టంగా  తెలియలేదని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. అయితే సూసైడ్‌ నోట్‌ ముక్కలు, ముక్కలుగా చింపి ఉండడం పలు అనుమానాలను రేకేత్తిస్తోంది. మరోవైపు ఈ పేపర్‌ ముక్కలను ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోందని కాన్పూర్ ఐఐటీ డిప్యూటీ డైరెక్టర్ మణింద్ర అగర్వాల్ వెల్లడించారు. ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌కు చెందిన  సింగ్ తల్లిదండ్రులకు సమాచారం అందించామన్నారు.  గురువారం రోజు పోస్టుమార్టం నిర్వహించనున్నారని స్థానిక కళ్యాణ్‌పూర్‌ పోలీసు స్టేషన్లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సతీష్ కుమార్ సింగ్ చెప్పారు. కాగా సింగ్‌ వరంగల్‌ నిట్‌  లో బీటెక్‌ పూర్తి చేశారు. అనంతరం 2015లో  మెకానికల్‌ ఇంజీనీరింగ్‌ విభాగంలో పీహెచ్‌డీలో జాయిన్‌ అయినట్టు  సమాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement