అమ్మకు కాకుండా.. అప్జల్‌గురుకు దండం పెడతారా..? | If not the mother, would you salute Afzal Guru? Asks Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

అమ్మకు కాకుండా.. అప్జల్‌గురుకు దండం పెడతారా..?

Dec 8 2017 9:33 AM | Updated on Apr 6 2019 9:15 PM

 If not the mother, would you salute Afzal Guru? Asks Venkaiah Naidu - Sakshi

న్యూఢిల్లీ: వందేమాతరం ఆలపించడంపై నెలకొన్న వివాదంపై భారత ఉప రాష్ట్రప్రతి వెంకయ్యనాయుడు ఘాటుగా స్పందించారు. తల్లికి కాకుండా ఉగ్రవాది అయిన అప్జల్‌గురూకు దండం పెడతారా అని ప్రశ్నించారు. వందేమాతరం ఆలపించమని, జాతీయగీతమైన జనగణమననే పాడుతామని కొన్ని రాజకీయ పక్షాలు ప్రకటించిన విషయం తెలిసిందే. 

వీహెచ్‌పీ నిర్వహించిన ఓ పుస్తక రిలీజ్‌ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. వందేమాతరం పాడటం అంటే మాతృభూమికి దండం పెట్టడమేనన్నారు. మాతృభూమికి దండం పెట్టడంలో వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఇక స్కూళ్లలో విద్యార్థులు వందేమాతరం ఆలపించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ‘భారత్‌ మాతాకీ జై’  అనేది దేవున్ని పూజించడం కాదన్న ఆయన దేశంలో నివసిస్తు‍న్న 125 కోట్ల మంది మతం, కులాలతో సంబంధం లేకుండా మేమంతా భారతీయులమని నివసిస్తున్నారని స్పష్టం చేశారు. ‘హైందవం అంటే గొప్ప ధర్మం. అది ఒక సంప్రదాయం. అదే భారతీయత. దీనిని మనం వారసత్వంగా పొందాం. హిందుత్వం అంటే ఓ జీవన విధానం’’ అని వెంకయ్యనాయుడు వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement