మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ప్రీ-పోల్ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో
గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ
నాగ్‌పూర్/పార్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ప్రీ-పోల్ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి ఆశావహులు మనసులో మాట బయటపెడుతున్నారు. సీఎం పోస్టును తాను చేపట్టాలని ప్రజలు అనుకుంటున్నారని దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె, ఎమ్మెల్యే పంకజ చెప్పారు.
‘నా పనే నన్ను ఆ పీఠం దగ్గరికి చేరుస్తుందని ఇదివరకు చెప్పా. మా నాన్న సీఎం కావాలని జనం అనుకున్నారు. నాకు ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే నేను సీఎంగా ఉంటానని ఎప్పుడూ చెప్పలేదు’ అని ఆమె తన నియోజకవర్గమైన పార్లీలో ఓటేసిన అనంతరం చెప్పారు.