నేను శివ భక్తుణ్ని: రాహుల్‌ | I am devotee of Lord Shiva | Sakshi
Sakshi News home page

నేను శివ భక్తుణ్ని: రాహుల్‌

Nov 14 2017 3:22 AM | Updated on Nov 14 2017 3:22 AM

I am devotee of Lord Shiva - Sakshi

బెచరాజీ: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆలయాలను సందర్శిస్తూ గుజరాత్‌లో హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారని బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాను శివ భక్తుడినని రాహుల్‌ సోమవారం వెల్లడించారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి రాహుల్‌ వివిధ ఆలయాలను సందర్శించడం తెలిసిందే. తాజాగా మెహ్‌సాన జిల్లాలోని మూడు ఆలయాల్లో రాహుల్‌ ప్రార్థనలు చేశారు. అనంతరం ఓ చోట ఆయన మాట్లాడుతూ ‘నేను శివ భక్తుడిని. బీజేపీ వారికి ఇష్టమొచ్చిన దుష్ప్రచారాన్ని నాకు వ్యతిరేకంగా చేయనివ్వండి. నా నిజాయితీ నాతోనే ఉంది’ అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement