విడాకులు ఇవ్వలేదన్న కోపంతో.. | Sakshi
Sakshi News home page

భార్యను నెల రోజులు గదిలో బంధించాడు

Published Wed, Jul 11 2018 5:18 PM

Husband Gave Triple Talaq Over Burnt Chapati - Sakshi

లక్నో: చపాతిని ఎక్కువగా కాల్చిందన్న కారణంతో ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు తలాక్‌ చెప్పి, ఇంటి నుంచి బలవంతంగా బయటకు గెంటివేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహూబ జిల్లాలో చోటుచేసుకుంది. చపాతి ఎక్కువగా కాల్చానన్న కారణంతో రెండు రోజుల క్రితం తన భర్త తలాక్‌ చెప్పాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన శరీరంపై సిగరెట్లతో కాల్చి గాయలు చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వీరిద్దరికి రెండేళ్ల క్రితమే వివాహం అయినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా యూపీలో ట్రిపుల్‌ తలాక్‌కు మరో ముస్లిం యువతి బలైంది. విడాకులు ఇవ్వలేదన్న కోపంతో భార్యకు భోజనం పెట్టకుండా నెల రోజులు గదిలో బంధించాడు. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించడంతో చికిత్స తీసుకుంటు ఆమె మంగళవారం మృతి చెందిందని రాయ్‌బరేలి పోలీసులు తెలిపారు. ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని గత ఏడాది ఆగస్ట్‌ 22న సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ముస్లిం మహిళల హక్కులను కాలరాస్తోందని, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను ట్రిపుల్‌ తలాక్‌ హరిస్తోందని న్యాయస్థానం పేర్కొంది. ట్రిపుల్‌ తలాక్‌ వ్యతిరేక బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినా రాజ్యసభలో మెజార్టీ లేకపోవడంతో ప్రస్తుతం బిల్లు చట్టరూపం దాల్చలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement