వందేళ్ల కిందటే రక్కసి

Hundred Years Ago There Was A Virus Like Corona In Bangalore - Sakshi

బెంగళూరులో ఈనాటిది కాదు

1918, 28లలో కరోనా తరహా వైరస్‌  

ఆనాడూ కోవిడ్‌ మాదిరి నిబంధనలు  

వెలుగుచూసిన పురాతన ఉత్తర్వులు

బనశంకరి: ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి లక్షణాలతో కూడిన జబ్బు సుమారు వంద సంవత్సరాల కిందటే బెంగళూరు నగరాన్ని వణికించిది. ఇన్‌ప్లూయెంజా నూమోనియా అనే వైరస్‌ జబ్బు 1918లోను, ఆ తరువాత మరో పదేళ్లకు వ్యాపించింది. అప్పటి బెంగళూరు సిటీ మునిసిపల్‌ కౌన్సిల్‌ ఆరోగ్య విభాగం అధికారి జేవీ. మస్కరెన్హాస్‌ 1928 మార్చి 03 తేదీన విడుదల చేసిన నోటీస్‌లో జబ్బు లక్షణాలను, ఔషధ చికిత్సను వివరించారు. ఆ పురాతన ప్రతులు ఇప్పుడు విడుదల కావడంతో వాట్సప్, ఫేస్‌బుక్‌లలో వైరల్‌ అవుతున్నాయి. 1918లో వెలుగు చూసిన ఇన్‌ప్లూయెంజా సోకిన ప్రజలు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడినట్లు తెలుస్తోంది. వ్యాధి ముదిరితే న్యూమోనియాగా మారే ప్రమాదం ఉంది.

అప్పట్లో ఇన్‌ఫ్లుయెంజా నుంచి ఆరోగ్యం కాపాడుకోవడం కోసం అధికారి మస్కరెన్హాస్‌ అప్పటి నోటీసుల్లో కొన్ని నిబంధనలు పేర్కొన్నారు. అవి ఇప్పటి కోవిడ్‌ నిబంధనల మాదిరిగానే ఉండడం విశేషం.

నోటీస్‌  1

  • ప్రజలు గుంపులుగా చేరే స్థలాలు అంటే సినిమా, నాటకాలు, సమావేశాలకు దూరంగా ఉండాలి 
  • జలుబు చేసిన వారికి దూరంగా ఉండాలి 
  • రాత్రి పగలు స్వచ్ఛమైన గాలి వీచే స్ధలంలో ఉండాలి 
  • దేహానికి, మనసుకు అలసట కాకుండా పనులు చేయరాదు 
  • ప్రతిరోజు మరుగుదొడ్డికి వెళ్లాలి  

ఇన్‌ఫ్లుయెంజా బారిన పడితే ఇలా చేయాలని  నోటీసు 2

  • జ్వరంతో కూడిన జలుబు వస్తే తక్షణం విశ్రాంత తీసుకోవాలి. రోగంతో భాదపడే వారు గది కిటికీ తలుపులు గాలి వచ్చేవిధంగా చూసుకోవాలి. స్వచ్ఛమైన గాలి వెలుతురుతో వైరస్‌ తగ్గుతుంది.  
  • సమీపంలో ఆసుపత్రికి వెళ్లి ఔషధాలను తీసుకోవాలి.  
  • ఔషధ అంగళ్లలో అమ్మే సిన్‌ అమ్మోనేటెడ్‌ క్వినైన్‌ అనే ఔషధం సేవించాలి.  
  • లవంగం, మిరపకాయ, ఎండిన అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని అర తులం, దానికి రెండు వెల్లుల్లి ముక్కలు కలిపి కాషాయం చేసి తీసుకోవాలి.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top