'ఆ రోజు నన్ను చూసి అందరూ నవ్విన వాళ్లే' | Humorist gets 3 PhDs after failing Class 11 & 12 | Sakshi
Sakshi News home page

'ఆ రోజు నన్ను చూసి అందరూ నవ్విన వాళ్లే'

Jul 3 2016 9:07 AM | Updated on Sep 4 2017 4:03 AM

'ఆ రోజు నన్ను చూసి అందరూ నవ్విన వాళ్లే'

'ఆ రోజు నన్ను చూసి అందరూ నవ్విన వాళ్లే'

ఆయన తొలి రోజుల్లో చదువుల్లో అంత ఘనాపాటేం కాదు. ఒకానొక సందర్భంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో కూడా తొలిసారి ఫెయిలయ్యాడు.

రాజ్కోట్: ఆయన తొలి రోజుల్లో చదువుల్లో అంత ఘనాపాటేం కాదు. ఒకానొక సందర్భంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో కూడా తొలిసారి ఫెయిలయ్యాడు. అలాంటి వ్యక్తి చేతుల్లో ఇప్పుడు మూడు పీహెచ్డీలు. ఆ మూడు ఓ ముగ్గురు ప్రముఖ వ్యక్తులకు అంకితాలు. ఈ రోజుల్లో ఒక్క డాక్టరేట్ ఉండటమే కష్టమవుతుండగా ఆయన మాత్రం ఏకంగా మూడు డాక్టరేట్లు పొందాడు. ఆయనే జగదీశ్ త్రివేది(49).

గుజరాత్ లోని సురేంద్రనగర్ కు చెందిన ఆయన మూడు పీహెచ్డీలు పూర్తి చేసి ప్రముఖ నవలా రచయిత దేవ్శంకర్ మెహతా, ప్రముఖ హాస్యకారుడు షాబుద్దిన్ రాథోడ్, ప్రముఖ మత గురువు మోరారీ బాపునుకు ఈ మూడింటిని అంకితం చేశాడు. అంతేకాదు.. జగదీశ్ త్రివేది కూడా ఒక పెద్ద హాస్యకారుడు. 'నేను ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లో ఫెయిలయిన తర్వాత ప్రతి ఒక్కరు నన్ను ఎగతాళి చేశారు నవ్వారు. నేను సైన్స్ చదవలేనని నాకు తెలుసు. అందుకే వెంటనే ఆర్ట్స్ కు మారిపోయాను. నేను ఇంటర్ ఒకసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. రెండు పీహెచ్డీలు పూర్తి చేసి నేను డల్ స్టూడెంట్ కాదని నిరూపించాను' అని ఆయన చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement