సల్మాన్ ఖాన్ మందు కొట్టాడో లేదో గుర్తులేదు...
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మందు కొట్టి ఉన్నాడో లేదో తనకు తెలియదని హిట్ రన్ కేసులో బార్ మేనేజర్ కోర్టులో సాక్ష్యం చెప్పారు.
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మందు కొట్టి ఉన్నాడో లేదో తనకు తెలియదని హిట్ రన్ కేసులో బార్ మేనేజర్ కోర్టులో సాక్ష్యం చెప్పారు. ముంబై కోర్టులో సోమవారం జరిగిన విచారణలో సల్మాన్ ఖాన్ ను బార్ మేనేజర్ గుర్తించాడు.
2002లో జరిగిన కారు ప్రమాదానికి ముందు సల్మాన్ తన స్నేహితులతో బార్ కు వచ్చారని అన్నారు. అయితే స్నేహితులతో కలిసి మద్యం సేవించారో లేదో తనకు సరిగా గుర్తులేదని కోర్టుకు తెలిపారు.
2002 సెప్టెంబర్ 28న జరిగిన ప్రమాదానికి ముందు సల్మాన్ ఖాన్ మద్యం సేవించారా అనే కోణంలో ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టింది. బాంద్రా సబర్బన్ లో తప్పతాగి కారు నడపడంతో ఒకరు మరణించగా, మరో నలుగురు గాయపడిన సంఘటనలో సల్మాన్ ఖాన్ పై హిట్ రన్ కేసు నమోదైంది.