హిండన్‌ నుంచి ప్రాంతీయ విమానాలు

విస్తరణ పనుల నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం ఇరుకు కావడమే కారణం

డిసెంబర్‌ నుంచి ప్రారంభం

ప్రారంభంలో కొన్ని సర్వీసులు మాత్రమే

పనులు పూర్తయ్యాక యథావిధిగా నడవనున్న విమానాలు

సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని ప్రాంతీయ విమానాలను తాత్కాలిక ప్రాతిపదికపై ఘాజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి నడిచేందుకు అనుమతించాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ.. ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌(డయల్‌)కు విజ్ఞప్తి చేసింది. ఇందుకు ఢిల్లీ విమానాశ్రయం అంగీకరించింది. ఢిల్లీ విమానాశ్రయం, పౌరవిమానయాన మంత్రిత్వశాఖ త్వరలో మెమోరాండం ఆ‹ఫ్‌ అండర్‌స్టాండింగ్‌(ఎంవోయూ)పై సంతకం చేయనున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రస్తుతం విస్తరణ పనులు జరుగుతున్నాయి. విమానాశ్రయం ఇరుకుగా మారినందువల్ల విస్తరణ పనులు పూర్తయ్యేంతవరకు కొన్ని ప్రాంతీయ విమానాలు హిండన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి నడిచేందుకు అనుమతించాలని విమానయానశాఖ డయల్‌ను కోరింది. ఢిల్లీ విమానాశ్రయం ప్రైవేటీకరణ సందర్భంగా కుదరిన ఒప్పందం ప్రకారం ఢిల్లీ విమానాశ్రమానికి 150 కిలో మీటర్ల పరిధిలో వాణిజ్య విమానాలను డయల్‌ అనుమతి లేకుండా నడుపరాదన్న నియమం దృష్ట్యా ప్రభుత్వం డయల్‌ అనుమతి కోరింది. స్థానిక అనుసంధాన పథకం కింద ప్రభుత్వం కొత్త రూట్లను వచ్చే నెలలో ప్రకటించనుంది.

కొంతకాలం ఢిల్లీ నుంచి విమానాలను హిండన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి నడపవలíని ఉంటుందని ప్రభుత్వం ఈ రూట్ల కోసం బిడ్‌ వేయనున్నవారికి తెలిపింది. మెమోరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌పై సంతకాలు జరిగిన తరువాత ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా హిండన్‌ స్టేషన్‌లో ప్రయాణీకుల సదుపాయాలను అభివద్ధి చేస్తుంది. ఢిల్లీ విమానాశ్రయాలలో విస్తరణ పనుల కింద కొత్త టెర్మినల్, కొత్త రన్‌వే, ఎలివేటెడ్‌ టాక్సీవే, అంతర్గత రైలు వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం టెర్మినల్‌–1 సామర్థ్యానికి మించి పనిచేస్తున్నందువల్ల అక్కడి నుంచి విస్తరణ పనులు మొదలుపెడ్తారు. మాస్టర్‌ప్లాన్‌ను మూడు మాడ్యులర్‌ దశలలో అమలుచేస్తారు. నిష్క్రమణ టెర్మినల్‌–డి, ఆగమన టెర్మినల్‌ డి–1సిని కలిపి సాలుకు 4 కోట్ల మంది ప్రాయాణీకుల సామర్థ్యాన్ని తట్టుకునేలా టెర్మినల్‌–టి1ను అభివృద్ధి చేస్తారు. టెర్మినల్‌–1 ప్రస్తుతం రెండు కోట్ల ప్రయాణీకుల సామర్థ్యంతో íపనిచేస్తోంది. ఇందులో 22 ఏరోబ్రిడ్జిలు నిర్మిస్తారు. టి3 సామర్థ్యాన్ని కూడా 3.4 కోట్ల ప్రయాణీకుల నుంచి 4 కోట్ల ప్రయాణీకులకు పెంచుతారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top