బస్సు రిజర్వాయుర్‌లోపడి 25 మంది వుృతి | Himachal Pradesh Bus Accident: Toll Rises to 25; 15 Still Missing | Sakshi
Sakshi News home page

బస్సు రిజర్వాయుర్‌లోపడి 25 మంది వుృతి

Sep 25 2014 1:22 AM | Updated on Sep 2 2017 1:54 PM

హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో బుధవారం ఉదయుం ఓ బస్సు గోవింద్‌సాగర్ రిజర్వాయర్‌లో పడిపోవడంతో 25 మంది

షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో బుధవారం ఉదయుం ఓ బస్సు గోవింద్‌సాగర్ రిజర్వాయర్‌లో పడిపోవడంతో 25 మంది ప్రయాణికులు వుృతిచెందారు. ఈ సంఘటనలో 15  మంది గాయుపడగా పలువురు గల్లంతయ్యూరని బిలాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ అజయ్‌శర్మ తెలిపారు. గాయుపడినవారిని బిలాస్‌పూర్ ఆస్పత్రిలో చేర్పించారు.

గల్లంతైనవారికోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రైవేటు సంస్థకు చెందిన 40 సీట్ల సామర్థ్యమున్న ఈ బస్సులో పరిమితికి మించి ప్రయూణికులు ఎక్కారని, ఇంకా కొందరు బస్సు టాప్‌పైన కూడా ఎక్కారని తెలుస్తోంది. వుృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని అధికారులు తెలిపారు. ఈ బస్సు రిషికేశ్ నుంచి బిలాస్‌పూర్‌కు వెళుతుండగా ప్రమాదానికి గురైందని వారు చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement