ఢిల్లీ - హర్యానా హైస్పీడ్‌ రైలు పరుగులు | High Speed Rail From Delhi To Haryana Soon | Sakshi
Sakshi News home page

ఢిల్లీ - హర్యానా హైస్పీడ్‌ రైలు పరుగులు

Jun 16 2018 9:02 AM | Updated on Jun 16 2018 11:29 AM

High Speed Rail From Delhi To Haryana Soon - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని సరై కలే ఖాన్‌ (ఎస్‌కేకే) నుంచి హర్యానా-రాజస్థాన్‌ సరిహద్దులోని షాహజన్‌పూర్‌-నీమ్రానా-బెహ్రాద్‌ వరకూ పరుగులు పెట్టే హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌ ప్రాజెక్టుకు హర్యానా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సగటున గంటకు వంద కిమీ వేగంతో హైస్పీడ్‌ రైలు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేస్తుంది. దక్షిణ హర్యానా నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణీకులకు ఈ రైలు సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు తొలిదశ చేపట్టేందుకు రూ 25,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. కాగా, మెరుగైన ప్రజా రవాణా ‍వ్యవస్థతో  గుర్‌గ్రామ్‌ సహా దక్షిణ హర్యానాలో వృద్ధి అవకాశాలు మెరుగుపడి పెట్టుబడులకు సానుకూల వాతావరణం నెలకొంటుందని కేబినెట్‌ భేటీ అనంతరం హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ పేర్కొన్నారు. రీజినల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఆర్‌ఆర్‌టీఎస్‌) ప్రాజెక్టు హర్యానా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement