2023 నాటికి ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు | high speed bullet train between Mumbai-Ahmedabad | Sakshi
Sakshi News home page

2023 నాటికి ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు

May 22 2017 6:24 PM | Updated on Sep 5 2017 11:44 AM

ముంబై–అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు 2023 నాటికి పట్టాలు ఎక్కనుందని నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అఖిల్‌ ఖరే తెలిపారు.

ముంబై : ముంబై–అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు 2023 నాటికి పట్టాలు ఎక్కనుందని నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అఖిల్‌ ఖరే తెలిపారు. ఈ రైలుకు సంబంధించిన సమగ్ర డిజైన్‌ కోసం గత డిసెంబర్‌లో జనరల్‌ కన్సల్టెంట్‌ను నియమించామని, గ్రౌండ్‌ సర్వే పూర్తి అయినట్లు తెలిపారు . ఈ ప్రాజెక్టులో 21 కి.మీ భూగర్భ టన్నెల్‌, 7 కి.మీ వరకు సముద్ర మార్గం ఉంటుందన్నారు. ఇది దేశంలోనే మొదటి హైస్పీడ్‌ రైలు మార్గం అన్నారు.

స్థల సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా మిగతా ప్రాజెక్టును భారీ ఎత్తులో నిర్మించనున్నట్లు తెలిపారు. అహ్మదాబాద్‌–సబర్మతి మధ్య రైల్‌ ఓవర్‌ బ్రిడ్జిలు ఉన్నాయన్నారు. మెట్రో లైన్‌ల నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయన్నారు. అహ్మదాబాద్, వడోదర, సబర్మతిలలో ప్రస్తుతం ఉన్న స్టేషన్‌లకు సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనుకున్నట్లు తెలిపారు. ముంబైలోని బీకేసీ వద్ద ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1.10 లక్షల కోట్లు అవుతుందని ఖరే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement