'ఆ హీరోహీరోయిన్ల సినిమాలు నిషేధం' | Hema Malini, Jaya Prada's films banned on Doordarshan | Sakshi
Sakshi News home page

'ఆ హీరోహీరోయిన్ల సినిమాలు నిషేధం'

Apr 17 2014 10:48 AM | Updated on Oct 2 2018 3:43 PM

'ఆ హీరోహీరోయిన్ల సినిమాలు నిషేధం' - Sakshi

'ఆ హీరోహీరోయిన్ల సినిమాలు నిషేధం'

ఎన్నికల బరిలో నిలిచిన హీరో హీరోయిన్లకు ఉన్నతాధికారులు మరో ఝలక్ ఇచ్చారు.

ఎన్నికల బరిలో నిలిచిన హీరో హీరోయిన్లకు ఉన్నతాధికారులు మరో ఝలక్ ఇచ్చారు. సదరు హీరోహీరోయిన్లు నటించిన చిత్రాలు జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్లో ప్రసారం చేయకుండా నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారులు గురువారం లక్నోలో వెల్లడించారు. హీరోయిన్లు హేమమాలిని, జయప్రద, నగ్మ,స్మృతి ఇరానీ, హీరో రాజ్ బబ్బార్తోపాటు జావెద్ జాఫ్రీ నటించిన చిత్రాలపై నిషేధం విధించినట్లు చెప్పారు.

 

ఎన్నికల నేపథ్యంలో ఆ హీరోహీరోయిన్లు నటించిన చిత్రాలు టీవీలో ప్రసారం చేస్తే ఓటర్లపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. రాజ్ బబ్బార్, నగ్మా (కాంగ్రెస్ పార్టీ ) , జయప్రద (రాష్ట్రీయ లోక్ దళ్ ), హేమమాలిని, స్మృతి ఇరానీ (బీజేపీ), జావేద్ జాఫ్రీ (ఆప్) పార్టీల తరపున లోక్ సభ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.


 

Advertisement
 
Advertisement
Advertisement