ముంబైలో భారీ వర్షం, ట్రాఫిక్‌కు అంతరాయం

Heavy overnight showers flood Mumbai, several trains cancelled - Sakshi

సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపాడు. నగర శివారు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నగర జీవనం అస్తవస్థంగా మారింది. వర్షం, వరద నీటితో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 24 గంటల్లో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. మరోవైపు రైళ్ల రాకపోకలతో పాటు రోడ్డు రవాణాపై కూడా తీవ్ర ప్రభావం పడింది. విమానాశ్రయ పరిసరాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ఇక ముంబై నుంచి బయల్దేరవలసిన అనేక రైళ్లు రద్దు చేయగా, పుణెలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోనావాలాలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ సందర్భంగా సెంట్రల్‌ రైల్వే సీపీఆర్వో సునీల్‌ ఉదేశీ మాట్లాడుతూ... గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో నడిచే రెండు రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. ఓ రైలును మరో మార్గంలోకి మళ్లించగా, మరో రెండు రైళ్ల రాకపోకలను రీ షెడ్యూల్‌ చేసినట్లు వెల్లడించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top