21 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంత ‘వేడి’

Heat Wave Worse in India After 21 Years - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌ తీరాన్ని ‘వాయు’ తుపాను గురువారం నాడు తాకే అవకాశం ఉందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా వడగాల్పులు తీవ్రంగా వీస్తున్నాయి. మున్నెన్నడు లేని విధంగా ఈసారి దేశంలోని 23 రాష్ట్రాలను వడగాల్పులు కుదిపేశాయి. కొన్ని నగరాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ను తాకాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ వేసవి కాలంలో ఇప్పటివరకు వడ గాల్పులకు 36 మంది మరణించారు. 2015లో తొమ్మదిమంది మరణం కన్నా ఇది నాలుగింతలు ఎక్కువ. సరిగ్గా 21 ఏళ్ల క్రితం అంటే, 1988లో సుదీర్ఘకాలం పాటు వడగాల్పులు దేశాన్ని వణికించాయి. ఈ నెల జూన్‌ 13వ తేదీతో నాటి రికార్డు సమమైందని భూ వాతావరణ శాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి. 1880 తర్వాత ప్రపంచ ఉష్ణోగ్రతలు 2014లో భారీగా పెరిగాయి. వాతావరణంలో వస్తున్న అకాల మార్పులే అందుకు కారణం. 

వడ దెబ్బ తగిలి తక్షణం మరణించిన వారినే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ గాల్పుల మతులుగా పరిగణిస్తోంది. కానీ వడగాల్పుల కారణంగా ఆరోగ్యం క్షీణించి మరణిస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. జాతీయ విపత్తు నిరోధక యంత్రాంగం (ఎన్‌డీఎంఏ) నివేదిక ప్రకారం వడగాల్పులు లేదా ఎండ తీవ్రత కారణంగా 1991–2000 మధ్య ఆరువేల మంది మరణిస్తే 2001–2010 నాటి మతుల సంఖ్య 1,36,000 మందికి చేరుకుంది. 2010లో దేశవ్యాప్తంగా వీచిన వడగాల్పులకు వందలాది మంది మత్యువాత పడ్డారు. 2010 నుంచి ఇప్పటి వరకు ఆరువేల మంది మరణించారు. 

2005 నాటి ‘నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌’ చట్టంగానీ, 2009లో తీసుకొచ్చిన ‘నేషనల్‌ పాలసీ ఆన్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌’ గానీ వడ గాల్పుల మతులను ప్రకతి వైపరీత్యాల కింద గుర్తించడం లేదు. అలా గుర్తించి ఉన్నట్లయితే మతుల కుటుంబాలకు నష్టపరిహారం అందడంతోపాటు వడగాల్పులను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక నిధులు కూడా అందుబాటులో ఉండేవి. 2016లో దేశవ్యాప్తంగా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల ఆ సంవత్సరం మతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రజలకు అందుబాటులో చలివేంద్రాలు, మజ్జిక కేంద్రాలను ఏర్పాటు చేయడం, రోడ్లు కరిగి పోకుండా నీళ్లు చల్లడం, ప్రజలు సేదతీరేందుకు 24 గంటలపాటు పార్కుల తలుపులు తెరచి ఉంచడం లాంటి చర్యలు తీసుకున్నారు. ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఎన్నో ఉన్నాయి. 

గూడు లేని అనాధలు, భిక్షగాళ్లు ఎక్కువగా వడగాల్పులకు మత్యువాత పడుతుంటారు. అలాంటి వారందరిని వేసవి శిబిరాలను ఏర్పాటు చేసి వాటిల్లోకి తరలించారు. రోడ్లను ఎప్పటికప్పుడు తడపడంతోపాటు రోడ్ల పక్కన విస్తతంగా చెట్లను పెంచాలి. ప్రతి చోట పార్కులను అభివద్ధి చేయాలి. ప్రజల చల్లబడేందుకు వారికి అందుబాటులో కూలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వడదెబ్బ తగిలిన వారికి అత్యవసర చికిత్స అందించేందుకు అందుబాటులో ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలి. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top