కొత్త బీఎండబ్ల్యూ కారును నదిలో వదిలేశాడు.. ఎందుకంటే..

Haryana Man Pushes New BMW In River After Father Denies Jaguar - Sakshi

చండీగఢ్‌ : తనకు నచ్చిన కారు కొనివ్వలేదని  తల్లిదండ్రులు బహుమతిగా ఇచ్చిన బీఎండబ్ల్యూ కారును నదిలో వదిలాడు ఓ పుత్రరత్నం. పైగా అదేదో ఘనకార్యం చేసినట్లు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ ఘటన హరియాణాలోని యమునానగర్‌లో చోటు చేసుకుంది.

యమునానగర్ పట్టణానికి చెందిన ఓ యువకుడికి జాగ్వార్ కారు అంటే ఎంతో ఇష్టం. తనకు జాగ్వార్ కారును బహుమతిగా కొనివ్వాలని కుమారుడు తల్లిదండ్రుల్ని కోరాడు. తల్లిదండ్రులు కుమారుడికి నచ్చిన జాగ్వార్ కారు కాదని, బీఎండబ్ల్యూ కారు కొని బహుమతిగా ఇచ్చారు. బీఎండబ్ల్యూ కారంటే ఇష్టం లేని కుమారుడు దాన్ని తీసుకెళ్లి యమునానగర్‌ నదిలో వదిలేసి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ తతంగాన్ని వీడియో తీయించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వీడియో ఆధారంగా యువకుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top