ఖరగ్‌పూర్ ఐఐటీలో ‘హ్యాపీనెస్ సైన్స్ సెంటర్’


కోల్‌కతా : విద్యార్థులు సంతోషమయ జీవనం అలవర్చుకుని ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు చేసేలా ‘హ్యాపీనెస్ సైన్స్’ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఖరగ్‌పూర్ ఐఐటీ  తెలిపింది.  పూర్వ విద్యార్థి సాతిందర్ సింగ్ రే ఖి ఈ ప్రాజెక్టుకు సహకారం అందిస్తున్నారు. ఈ కేంద్రానికి ఆయన పేరే పెట్టారు. అర్థవంత జీవనం, సంతోషం, సంక్షేమం, పరిపూర్ణ స్వీయ అభివృద్ధి, సానుకూల దృక్పథం పెంపుదలకు అనువైన వాతావరణం కల్పించడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని ఐఐటీ ఓ ప్రకటనలో పేర్కొంది.



విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్యాంపస్ కమ్యూనిటీ మధ్య ప్రత్యేక చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ‘హ్యాపీనెస్ సైన్స్’ను శాస్త్రీయంగా అన్వేషించే పరిశోధనలు, కోర్సులు, శిక్షణ కార్యక్రమాలను ఇందులో అభివృద్ధి చేస్తారు. క్యాంపస్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు స్థల కేటాయింపు పూర్తయిందని ,త్వరలోనే నిర్మాణం జరుగుతుందని ఐఐటీ వెల్లడించింది.  ఈ ఆగస్టులో తొలి ‘హ్యాపీనెస్ సైన్స్’ వర్క్‌షాప్  నిర్వహిస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top