breaking news
Kharagpur IIT
-
Digital Library: అరచేతిలో పుస్తక భాండాగారం
సాక్షి, కమ్మర్పల్లి(నిజామాబాద్): కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఏడాది నుంచి గ్రంథాలయాలు మూతపడి ఉన్నాయి. ఒకవేళ తెరిచినా పాఠకులు రాలేని పరిస్థితి నెలకొంది. తెరుచుకున్న సమయంలో పాఠకులు రావడానికి ఆసక్తి చూపడం లేదు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులు తమకు కావలసిన పుస్తకాలను చదవలేక పోతున్నారు. సెల్‌ఫోన్, ఇంటర్నెట్లో మునిగిపోతున్న విద్యార్థులు, యువకులు, ఉద్యోగాన్వేషణలో ఉన్న అభ్యర్థులకు కేంద్రం అరచేతిలోనే విజ్ఞానాన్ని అందించే ‘డిజిటల్ లైబ్రరీ’ని అందుబాటులోకి తెచ్చింది. నిరుద్యోగులు, యువకులు సద్వినియోగం చేసుకునేలా పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను డిజిటలైజేషన్ చేసి ‘నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. దీంతో అరచేతిలో డిజిటల్ లైబ్రరీ రూపుదిద్దుకుంది. ఇందులో 4 కోట్లకు పైగా పుస్తకాలు పాఠకులకు ఉపయోగపడి, అవసరమయ్యే విజ్ఞానాన్ని పంచనున్నాయి. ఖరగ్‌పూర్ ఐఐటీ సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అనుమతితో ఖరగ్‌పూర్ ఐఐటీ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నెట్లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా పేరుతో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసింది. ఇందులో విషయ నిపుణుల వీడియోలను పొందుపరిచారు. పాఠశాల, కళాశాల, ఇంజనీరింగ్, వైద్య, న్యాయ విద్య, సాహిత్యం, సంస్కృతం ఇలా అన్ని రకాల స్టడీ మెటీరియల్‌ను ఇంగ్లీష్, హిందీతో పాటు, ఇతర భాషల్లో ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. పోటీ పరీక్షలకు కావలసిన అన్ని అంశాలను పొందుపరిచారు. పాఠశాల పుస్తకాలు(సీబీఎస్ఈ సిలబస్), లిట్రేచర్, మెడిసిన్, లా మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ పుస్తకాలు, మత గ్రంథాలు వివిధ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. ఈ పుస్తకాలన్ని పీడీఎఫ్ ఫార్మాట్లో ఉండగా, సైట్ ఒపెన్ చేసి చదువుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వినియోగం ఇలా... స్మార్ట్ ఫోన్, ల్యాప్‌ట్యాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్ల ద్వారా డిజిటల్ లైబ్రరీని వినియోగించుకునేలా తీర్చిదిద్దారు. ఇంటర్నెట్ గూగుల్‌లో ‘నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ టైప్ చేస్తే డిజిటల్ లైబ్రరీ తెరుచుకుంటుంది. ఈమెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మనకు కావలసిన అంశాలను ఎంచుకొని చదువుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లైబ్రరీలో వీడియోల ద్వారా సైతం విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అని టైప్ చేసి డిజిటల్ లైబ్రరీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వినియోగదారులు సబ్స్క్రిప్షన్ పెట్టుకుంటే కొత్త పుస్తకాలు అందుబాటులోకి వస్తే ఈ మెయిల్ ద్వారా మెసేజ్ వస్తుంది. ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయాల పరిస్థితి... ఉమ్మడి జిల్లాలో 44 గ్రంథాలయాలు ఉండగా, 85 వేల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. సుమారు 6 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కరోనాకు ముందు ఇవి పాఠకులతో కళకళలాడేవి. కరోనాతో గ్రంథాలయాలు వెలవెలబోయాయి. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు, యువకులకు కేంద్రం అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. చదవండి: ఫోన్ పోతే ఇలా తేలికగా కనిపెట్టొచ్చని తెలుసా? -
పుస్తక కోటి.. ఖరగ్‌పూర్ ఐఐటీ!
ఈపుస్తకాలతో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు - ఒకటో తరగతి నుంచి పరిశోధనల వరకు.. చరిత్ర నుంచి టెక్నాలజీ వరకు.. - 70కి పైగా భాషలు.. అన్నీ ఆన్లైన్లో.. ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులైనా.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులైనా.. ఫలానా పుస్తకం దొరకలేదన్న బెంగ అక్కర్లేదు. కాలేజీ లైబ్రరీలో ఒకే పుస్తకం ఉందే..దాన్ని ఇంకొకరికి ఇచ్చేశారు.. చదువుకోవడం ఎలా.. అనే ఆందోళన కాలేజీ విద్యార్థులకు అసలే అవసరం లేదు.. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్,రాష్ట్ర సర్వీసు కమిషన్ నిర్వహించే గ్రూప్స్, ఎన్సీఈఆర్టీ సిలబస్‌కు సంబంధించిన పుస్తకాలను ఎలా కొనాలనే ఆలోచన వద్దు.. సాక్షి, హైదరాబాద్: ఇప్పుడు ఒకటో తరగతి నుంచి పరిశోధనలకు అవసరమైన రిఫరెన్స్ పుస్తకాల దాకా అన్నీ ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.. ఆన్లైన్లో చదువుకోవచ్చు.. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.. వీడియోలు చూడవచ్చు.. ఆడియో వినవచ్చు.. పీడీఎఫ్ కాపీలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్ సదుపాయం. అదొక్కటి ఉంటే ఏ పుస్తకమైనా చదువుకోవచ్చు. సుమారు కోటికిపైగా పుస్తకాలు, ఆర్టికల్స్, రచనలు, వ్యాసాలను ఐఐటీ ఖరగ్‌పూర్ ఆన్లైన్లో (https://ndl.iitkgp.ac.in/) అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) సహకారంతో నేషనల్ డిజిటల్ లైబ్రరీని రూపొందించింది. ఒక్క క్లిక్.. సమస్తం కళ్లముందు! డిజిటల్ పుస్తకాలు, ఆర్టికల్స్, ఇతర అనేక రూపాల్లో ప్రతి ఒక్కరికీ చదువు, సమగ్ర సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ వినూత్న ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ఒకటో తరగతి నుంచి పరిశోధన విద్యార్థి వరకు.. చరిత్ర నుంచి టెక్నాలజీ వరకు అన్ని సబ్జెక్టులు, అన్ని రంగాలకు చెందిన పుస్తకాలను ఒకే దగ్గరకు చేర్చింది. పైసా చెల్లించనవసరం లేకుండా విద్యార్థులు ఉచి తంగా తీసుకోవచ్చు. సాధారణ గ్రంథాలయాల తరహాలో డిపాజిట్లు అక్కర్లేదు. అవసరమైన పుస్తకాన్ని వెతుక్కునేందుకు ఎక్కువ సమయం అవసరం లేదు. ఒక్క క్లిక్‌తో కావాల్సిన పుస్తకాన్ని చదువుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేశంలోని పలు యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన పుస్తకాలను డిజిటలైజ్ చేసి ఈ డిజిటల్ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు. అనేక విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) పుస్తకాలన్నింటిని కంప్యూటరీకరించి అందుబాటులోకి తెచ్చారు. త్వరలో మెుబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు. రిజిస్ట్రేషన్ సులభం డిజిటల్ లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం చాలా సులభం. ఈమెయిల్ ఐడీ, చదువుతున్న లేదా చదివిన కోర్సు, వర్సిటీ పేరు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేస్తే చాలు. ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత ఈమెయిల్ ఐడీకి లింకు వస్తుంది. ఈ లింకుపై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేసి లైబ్రరీలో లాగిన్ కావచ్చు. డిజిటల్ లైబ్రరీ ప్రత్యేకతలెన్నో.. ⇒ 2 లక్షల మంది ప్రముఖుల 3 లక్షల ఆర్టికల్స్ ⇒ లక్ష మంది భారతీయ విద్యార్థుల థీసిస్‌లు ⇒ రాత ప్రతులు, వివిధ భాషల్లో ఆడియో లెక్చర్లు ⇒ 18 వేలకు పైగా ఉపన్యాసాలు ⇒ 33 వేలకు పైగా గత ప్రశ్నపత్రాలు ⇒ వర్సిటీలు, పాఠశాల బోర్డుల ప్రశ్నపత్రాలు, జవాబులు ⇒ వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ రంగాల వెబ్ కోర్సులు ⇒ వార్షిక నివేదికలు, 12 వేలకుపైగా వివిధ నివేదికలు ⇒ సాంకేతిక కోర్సుల నివేదికలు, న్యాయ తీర్పులు అందుబాటులో ఉన్న ఈపుస్తకాలు 5,36,487 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్, ప్రోగ్రామింగ్ 1,52,340 ఫిలాసఫీ, సైకాలజీ: తత్వశాస్త్రం, మానసిక తత్వశాస్త్రం, అస్తిత్వ, విశ్వ ఆవిర్భావం, లాజిక్, ఎథిక్స్ 1,67,671 మతంతత్వం, మత సిద్ధాంతం, దైవ భావన, సైన్స్ అండ్ రిలీజియన్ ఆర్ట్స్.. 1,45,290 లిటరేచర్ 4,40,607 హిస్టరీ జియోగ్రఫీ 3,65,535 8,70,802 సోషల్ సైన్సెస్: సోషియాలజీ,ఆంత్రొపాలజీ, సామాజిక మార్పు,రాజకీయ, అర్థ, న్యాయశాస్త్రాలు,పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మిలటరీ సైన్స్ 56,17,754 టెక్నాలజీ: వ్యవసాయ టెక్నాలజీ, కెమికల్, సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ వంటి సాంకేతిక కోర్సుల పుస్తకాలు 22,65,577 నేచురల్ సైన్సెస్:వైద్యం, ఆరోగ్యం, ఫిజియాలజీ,ఫార్మకాలజీ, థెరపీ, సర్జరీకి సంబంధించిన వైద్య పుస్తకాలు భాషలు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మలయాళం, తమిళ్, గుజరాతీ తదితరాలు, విదేశీ భాషలు ఫార్మాట్లు పీడీఎఫ్, హెచ్‌టీఎల్/హెచ్‌టీఎంఎల్, ఎంపీ3/4/ఎంపీఈజీ4, ఎఫ్‌ఎల్‌వీ, డాక్యుమెంట్ 70కి పైగా భాషల్లో..కోటికి పైగా ఈపుస్తకాలు -
ఖరగ్‌పూర్ ఐఐటీలో ‘హ్యాపీనెస్ సైన్స్ సెంటర్’
కోల్‌కతా : విద్యార్థులు సంతోషమయ జీవనం అలవర్చుకుని ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు చేసేలా ‘హ్యాపీనెస్ సైన్స్’ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఖరగ్‌పూర్ ఐఐటీ తెలిపింది. పూర్వ విద్యార్థి సాతిందర్ సింగ్ రే ఖి ఈ ప్రాజెక్టుకు సహకారం అందిస్తున్నారు. ఈ కేంద్రానికి ఆయన పేరే పెట్టారు. అర్థవంత జీవనం, సంతోషం, సంక్షేమం, పరిపూర్ణ స్వీయ అభివృద్ధి, సానుకూల దృక్పథం పెంపుదలకు అనువైన వాతావరణం కల్పించడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని ఐఐటీ ఓ ప్రకటనలో పేర్కొంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్యాంపస్ కమ్యూనిటీ మధ్య ప్రత్యేక చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ‘హ్యాపీనెస్ సైన్స్’ను శాస్త్రీయంగా అన్వేషించే పరిశోధనలు, కోర్సులు, శిక్షణ కార్యక్రమాలను ఇందులో అభివృద్ధి చేస్తారు. క్యాంపస్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు స్థల కేటాయింపు పూర్తయిందని ,త్వరలోనే నిర్మాణం జరుగుతుందని ఐఐటీ వెల్లడించింది. ఈ ఆగస్టులో తొలి ‘హ్యాపీనెస్ సైన్స్’ వర్క్‌షాప్ నిర్వహిస్తారు.