మేనిఫెస్టోల నిషేధంపై హైకోర్టు విచారణ | Sakshi
Sakshi News home page

మేనిఫెస్టోల నిషేధంపై హైకోర్టు విచారణ

Published Tue, Jul 11 2017 11:20 AM

Gujarat High Court admits plea for ban on election manifestos

అహ్మదాబాద్‌: ఎన్నికల మేనిఫెస్టోలపై నిషేధం విధించడంతోపాటు హామీలకు పార్టీలను జవాబుదారులను చేయాలంటూ వచ్చిన పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. రాబోయే కాలంలో ఈ పిటిషన్‌ను కోర్టు విచారిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ వీఎం పంచోలీలు వెల్లడించారు.

కాగ్రెస్‌ పార్టీకి చెందిన జయేశ్‌ షా ఈ పిటిషన్‌ వేశారు. 2014లో బీజేపీ ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందనీ, వాటిని చాలా వరకు నెరవేర్చలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలాగే అనేక పార్టీలు అమలు సాధ్యం కాని హామీలను ప్రకటిస్తూ ఓటు వేసే సమయంలో ప్రజలను మభ్యపెడుతున్నాయనీ, అధికారంలోకి వచ్చాక అవి కాగితాలకే పరిమితమవుతున్నా యని జయేశ్‌ పిటిషన్‌లో విమర్శించారు.

Advertisement
Advertisement