అమరులకు పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు

అమరులకు పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు - Sakshi


గడ్చిరోలి : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల మందుపాతరకు బలైపోయిన ఏడుగురు పోలీసుల అంత్యక్రియలు పోలీస్‌ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య పోలీసులు గౌరవ వందనంతో అమరవీరులకు అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి బాధిత కుటుంబసభ్యులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.కాగా చామూర్శి తాలూకా పవిమురాండా-మురమాడి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 9.40 గంటలకు జరిగిన ఈ దాడిలో ఏడుగురు పోలీసులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top