సీఆర్పీఎఫ్‌ జవాన్లపై గ్రెనేడ్లతో ఉగ్రదాడి

Grenade Attack On CRPF Patrol Vehicles in Srinagar - Sakshi

శ్రీనగర్‌ :  శ్రీనగర్‌లోని కవ్‌దారా ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను లక్ష్యంగా చేసుకొని వారు ప్రయాణిస్తున్న పెట్రోలింగ్‌ వాహనాలపై గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లు తీవ్రంగా గాయపడగా వారు ప్రయాణిస్తున్న వాహనాలు పూర్తిగా ద్వంసమయ్యాయి. అయితే ఈ దాడులు సీఆర్పీఎఫ్‌ జవాన్లను లక్ష్యంగా చేసుకొని గ్రెనేడ్లతో దాడులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఘటన జరిగిన ప్రాంతాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకొని ఉగ్రవాదులు కదలికలను గుర్తించేందుకు పరిశోధన నిర్వహిస్తున్నారు. అయితే ఈ దాడిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top