ఏపీభవన్‌లో అంబేద్కర్‌కు ఘన నివాళి

Great Tribute To BR Ambedkar At AP Bhawan In Delhi - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణంలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి  ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ ఎన్వి రమణారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం "మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, ప్రజల సామాజిక బాద్యత" అంశంపై ఎఐడిఆర్ఎఫ్, ఏపీ భవన్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురజాడ సమావేశ మందిరంలో రౌండ్ టేబుల్  సమావేశం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఏపీ భవన్ అధికారులు,సిబ్బంది, ఢిల్లీలోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొని డాక్టర్ అంబేద్కర్ చిత్ర పటానికి పుష్పాంజలి  ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top