ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా పర్యాటకులను ఆకర్షించేందుకు అండమాన్ నికోబార్‌లో మరో ఐదు దీవులను తెరవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం పేర్కొన్నారు.
మరో ఐదు దీవులను తెరుస్తాం: జవదేకర్
Feb 23 2016 9:04 AM | Updated on Jun 1 2018 9:35 PM
న్యూఢిల్లీ: ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా పర్యాటకులను ఆకర్షించేందుకు అండమాన్ నికోబార్‌లో మరో ఐదు దీవులను తెరవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం పేర్కొన్నారు. ప్రస్తుతం అండమాన్ నికోబార్ 500 ద్వీపాల సమూహం కలిగి ఉందని, ఇందులో ఎక్కువశాతం జనావాసాలు కానివి, నిషేధిత ప్రాంతాలని చెప్పారు. తాను ఇటీవల అండమాన్ నికోబార్‌ను సందర్శించినపుడు ఈ ఐదు దీవులపై అక్కడి స్థానికులతో మాట్లాడానన్నారు.
అక్కడ 94 శాతం అటవీ ప్రాంతంగా ఉందని, మిగిలినది తీరప్రాంత నియంత్రణ మండలం (కోస్టల్ రెగ్యులేషన్ జోన్-సీఆర్‌జెడ్)గా ఉందన్నారు. అటవీ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా ప్రణాళిక ప్రకారం ఐదు దీవులను అభివృద్ధి చేస్తామని, ఐదుగురు మంత్రులతో కూడిన బృందం పర్యాటకరంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని ప్రకాశ్ జవదేకర్ వివరించారు.
Advertisement
Advertisement