breaking news
eco tourisam
-
‘ఎక్స్ పీరియం పార్క్ అద్భుతం’
సాక్షి,హైదరాబాద్ : ‘ఎక్స్ పీరియం పార్క్ అద్భుతం’ అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్లో ఎక్స్పీరియం పార్క్‌ను ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవిలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఒక మంచి ఎకో టూరిజం పార్క్‌ను ఇక్కడ ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రజా ప్రభుత్వం ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లింది. రాష్ట్రంలో టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. టెంపుల్, ఎకో టూరిజమే రాష్ట్రానికి గుర్తింపుతో పాటు ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుంది.దేవాలయ దర్శనాలకు, అటవీ సంపదను చూసేందుకు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాం.రామప్ప, వేయిస్తంభాల గుడి లాంటి అద్భుతమైన ఆలయాలు తెలంగాణలో ఉన్నాయి. నల్లమల అడవులు, మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. త్వరలో టూరిజం పాలసీని తీసుకురాబోతున్నాం. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. ఎక్స్పీరియం లాంటి ఎకో టూరిజం పార్కును ఇక్కడ అభివృద్ధి చేయడం అభినందనీయం. రాబోయే రోజుల్లో ఇది అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారనుంది.వికారాబాద్ అటవీ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. త్వరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్రం ఆలోచనకు అనుగుణంగా ఈ పార్క్ ను అభివృద్ధి చేయడం అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని భావిస్తోంది. వనజీవి రామయ్య లాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతీ విద్యార్థి తల్లి పేరుతో ఒక మొక్కను నాటించి సంరక్షించేలా కొన్ని విధానాలు తీసుకురాబోతున్నాం’ అని అన్నారు. -
మరో ఐదు దీవులను తెరుస్తాం: జవదేకర్
న్యూఢిల్లీ: ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా పర్యాటకులను ఆకర్షించేందుకు అండమాన్ నికోబార్‌లో మరో ఐదు దీవులను తెరవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం పేర్కొన్నారు. ప్రస్తుతం అండమాన్ నికోబార్ 500 ద్వీపాల సమూహం కలిగి ఉందని, ఇందులో ఎక్కువశాతం జనావాసాలు కానివి, నిషేధిత ప్రాంతాలని చెప్పారు. తాను ఇటీవల అండమాన్ నికోబార్‌ను సందర్శించినపుడు ఈ ఐదు దీవులపై అక్కడి స్థానికులతో మాట్లాడానన్నారు. అక్కడ 94 శాతం అటవీ ప్రాంతంగా ఉందని, మిగిలినది తీరప్రాంత నియంత్రణ మండలం (కోస్టల్ రెగ్యులేషన్ జోన్-సీఆర్‌జెడ్)గా ఉందన్నారు. అటవీ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా ప్రణాళిక ప్రకారం ఐదు దీవులను అభివృద్ధి చేస్తామని, ఐదుగురు మంత్రులతో కూడిన బృందం పర్యాటకరంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని ప్రకాశ్ జవదేకర్ వివరించారు.