నన్నూ..నా కుటుంబాన్ని ఏం చేస్తారో..? | Government Conspiring To Get Me And My Family Killed, Alleges Rabri Devi  | Sakshi
Sakshi News home page

నన్నూ..నా కుటుంబాన్ని ఏం చేస్తారో..?

Apr 11 2018 1:57 PM | Updated on Jul 18 2019 2:21 PM

Government Conspiring To Get Me And My Family Killed, Alleges Rabri Devi  - Sakshi

భర్త లాలూ ప్రసాద్‌, కుమారులతో బీహార్‌ మాజీ సీఎం రబ్రీదేవి (ఫైల్‌ఫోటో)

సాక్షి, పాట్నా : తననూ తన కుటుంబాన్ని హతమార్చేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బిహార్‌ మాజీ సీఎం రబ్రీ దేవి ఆరోపించారు. పాట్నాలో తన నివాసం వద్ద పహారా కాసే 32 మంది మిలటరీ జవాన్లను బిహార్‌ ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో రబ్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన నివాసం వద్ద సెక్యూరిటీని మంగళవారం ఉపసంహరించిన ప్రభుత్వం తిరిగి రాత్రి 9 గంటల సమయంలో పునరుద్ధరిచింది.. ఇది తననూ, తన కుటుంబాన్ని మట్టుబెట్టేందుకు ప్రభుత్వం పన్నిన కుట్ర కాదా అని  ఆమె ప్రశ్నించారు. ఇది నితీష్‌ కుమార్‌, సుశీల్‌ మోదీ, బిహార్‌ ప్రభుత్వ కుట్రేనని ఆరోపించారు.

లాలూజీని జైల్లో పెట్టి నిత్యం వేధిస్తున్నారు..ఆయన వ్యాధులతో మరణిస్తారో..లేక మందులతో చంపేస్తారో తనకు అర్ధం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. లాలూ చక్కెర స్ధాయిలు పెరుగుతున్నాయని..ఈ ప్రభుత్వాన్ని తాను నమ్మే పరిస్థితిలో లేనని వ్యాఖ్యానించారు. మరోవైపు రబ్రీదేవికి భద్రతను ఉపసంహరించినందుకు నిరసనగా ఆమె కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, తన సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌తో కలిసి తమకు కల్పించిన భద్రతను వదులుకున్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement