మందు కొడితే.. అత్తారిల్లే..!?

మందు కొడితే.. అత్తారిల్లే..!?


సాక్షి, పనాజీ: రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నిషేధిస్తున్నట్లు గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారేకర్‌ ఆదివారం ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లోనూ, రహదారులమీద మద్యం సేవించిన వ్యక్తులు సృష్టించే ఆగడాలకు అంతు ఉండడంలేదని చెప్పారు. ఇలా కొంతమంది తాగుబోతులు చేసే వికృతచేష్టల వల్ల ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఇదోక తాగుబోతుల రాష్ట్రంగా భావించే అవకాశం ఉందన్నారు.


బహిరంగ మద్యపాన నిషేధానికి సంబంధించిన ఎక్సైజ్‌ చట్టానికి సవరణలు చేసి అమలు చేస్తామని ప్రకటించారు.  బహిరంగ ప్రదేశాల్లో మద్యనిషేధానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను వచ్చే నెల్లో విడుదల చేస్తామని పారేకర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లఘించిన వారిని ఎక్సైజ్‌ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని చెప్పారు.


 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top