ఏటీఎమ్‌ వినాయకుడు; ఎనీ టైమ్‌ మోదక్‌

Get Modak From ATM Ganesh In Pune - Sakshi

పుణె: గణపతి నవరాత్రుల సందర్భంగా తాము ప్రతిష్టించే వినాయక విగ్రహాలు అందరి దృష్టిని ఆకర్షించాలని భక్తులు కోరుకుంటారు. అయితే మహారాష్ట్ర, పూణెలోని శంకర్‌నగర్‌కు చెందిన గణేష్‌ భక్తులు మాత్రం విగ్రహా ఏర్పాటులో సాంకేతికతను వినియోగించారు. నూతనంగా ఆలోచించిన వారు.. ఏటీఎమ్‌(ఎనీ టైమ్‌ మోదక్‌) వినాయకున్ని ఏర్పాటు చేశారు. మోదక్‌ అంటే వినాయకునికి ఇష్టమైన ప్రసాదం. 

ఏటీఎమ్‌ స్క్రీన్‌ మీద వినాయకని చిత్రాన్ని ఉంచారు. ప్రత్యేకంగా రూపొందించిన కార్డు ద్వారా ఈ ఏటీఎమ్‌ సేవలను పొందవచ్చు. మాములు ఏటీఎమ్‌లలో డబ్బులు వచ్చినట్టే ఇక్కడ వినాయకుని ప్రసాదం లభిస్తుంది. భక్తులు కార్డు వినియోగించినప్పుడు ఏటీఎమ్‌లో నుంచి ప్రసాదం వస్తుంది. ఈ ఏటీఎమ్‌పై నంబర్లకు బదులు ప్రత్యేకమైన బటన్‌లు ఉంటాయి. వాటిపై క్షమాపణ, శాంతి, భక్తి, జ్ఞానం, అభిమానం.. అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ ఏటీఎమ్‌ వినాయకునికి సంబంధించిన విశేషాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top