'చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలి'

General VK Singh on India China Border Row In Galwan Valley - Sakshi

సాక్షి, ఢిల్లీ : చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని కేంద్ర రోడ్లు, రవాణా సహాయశాఖ మంత్రి, మాజీ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ విజయ్‌కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. చైనాతో యుద్దం అనేది చివరి అస్త్రంగా వాడాలని, మొదట చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని దానికి చాలా దారులు ఉన్నాయని తెలిపారు. హిందుస్తాన్‌ టైమ్స్‌ ఇంటర్య్వూలో పాల్గొన్న వీకే సింగ్‌ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నారు. (పక్కా ప్రణాళితోనే భారత సైన్యంపై దాడి)

మాజీ ఆర్మీ చీఫ్‌గా మీ గ్రౌండ్‌ రిపోర్టు ఏమిటి ?
ప్రస్తుతం అక్కడ పరిస్థితి భారత బలగాల నియంత్రణలోనే ఉంది. ఘర్షణ జరిగిన గల్వాన్‌ లోయ పిపి 14 పాయింట్‌ వద్ద చైనా సైనికుల నుంచి ఎలాంటి ఆక్రమణలు, చొరబాట్లు లేవు. పిపి 15 పాయింట్‌ నుంచి చైనా ప్రతీ ఏడాది అక్రమంగా రావాలనుకున్న ప్రతీసారి భారత బలగాలు వారిని అడ్డుకుంటూనే ఉంటాయి. 

గల్వాన్‌ లోయ తమదేనని చైనా అంటుంది.. దీనిపై మీ స్పందన ?
అదంతా తప్పుడు ప్రచారం. గల్వాన్‌ లోయ చైనా ఎల్‌ఏసీలో లేదు. వారు మన భూభాగంలో లేరు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఏసీ) అనేది 1959లో ఇచ్చిన మ్యాప్ నుంచి ఒక వివరణగా మాత్రమే ఉంది. మొదటినుంచి ఈ అంశంపై చైనీయులు ఏదో విధంగా తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. కానీ ఇరు దేశాలు తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని రక్షించుకోవడానికే ఎప్పుడు ప్రాధాన్యతనిస్తాయి.

ఘర్షణలో చైనా సైనికులు ఎంతమంది చనిపోయారనే దానిపై ఆ దేశం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? 
1962లో భారత్‌- చైనా మధ్య జరిగిన యుద్ధంలో కూడా ఎంతమంది మరణించారనేది వెల్లడించలేదు. మనకు తెలిసినంత వరకు ఇరు దేశాల నుంచి దాదాపు 2వేల మంది సైనికులు తమ ప్రాణాలు కోల్పోయారు. కానీ అప్పుడు కూడా చైనా అసలు లెక్క వివరించకుండా కేవలం 200 మందే ప్రాణాలు కోల్పోయారని వాదించింది. ఇప్పుడు కూడా మన ప్రభుత్వ లెక్కల ప్రకారం 43 మంది చైనా సైనికులు హతమయ్యారని పేర్కొన్నారు. ఆ సంఖ్య ప్రకటించాలా వద్దా అనేది చైనా నిర్ణయించుకోవాలి. అసలు ఆరోజు ఘర్షణలో దాదాపు 600 మంది ఉండి ఉంటారని అనిపిస్తుంది. ఒకరినొకరు తోసుకోవడం, రాడ్లతో కొట్టకోవడం వంటివి చేశారు. ఏదైతేనేం ఇరు దేశాల సైనికులకు నష్టం జరిగింది. (గ‌ల్వాన్ ఘ‌ట‌న‌: ఏం జ‌రుగుతుందో చూడాలి!)

అఖిల పక్ష సమావేశం సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటలిజెన్స్‌ ఫెయిల్యూర్‌ అని అభివర్ణించారు. దీనిపై మీ సమాధానం?
దీనిపై నేను నేను స్పందించలేను. ఎందుకంటే ఇంటెలిజెన్స్ విభాగం రా(రిసెర్చ్‌ అనాలిసిస్‌ వింగ్‌) ఆధ్వర్యంలో నడుస్తుంది. కానీ ఇంటలిజెన్స్‌ వైఫల్యం మాత్రం కాదని కచ్చితంగా చెప్పగలను . ఎందుకంటే వారు ఎల్‌వోసీ, ఎల్‌ఏసీ వద్ద జరిగే ఘర్షణల్లో తలెత్తకుండా నిషేదించబడ్డాయి. ఈ నిర్ణయం వారి ప్రభుత్వ హయాంలోనే(2012)లో జరిగిందని సోనియా గాంధీ తెలుసుకుంటే మంచింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top