పక్కా ప్రణాళితోనే భారత సైన్యంపై దాడి

China Moved Trucks And Bulldozers Near Galwan Valley In A Week - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌-చైనా సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించి చైనా కుట్రలు ఒక్కొక్కటిగా బయపడుతున్నాయి. ప్రణాళికా బద్ధంగానే భారత సైనికులపై దాడికి పాల్పడినట్లు తాజా సమాచారం ద్వారా స్పష్టమవుతోంది. దాడికి వారం ముందే గల్వాన్‌ లోయలో చైనా 200 బుల్డోజర్లు, యుద్ధ ట్యాంకులు, ఆయుధ సామాగ్రిని తీసుకెళ్లే ట్రక్కులను తరలించినట్లు తెలిసింది. ఈ మేరకు  జూన్‌ 6 నుంచి 16 మధ్య చిత్రీకరించిన శాటిలైట్‌ చిత్రాల్లో చైనా జిత్తులు బయటపడ్డాయి. ఈ వాహనాలను తరలిస్తున్న ఉపగ్రహ దృశ్యాలు ఓ జాతీయ మీడియా ఆదివారం ప్రచురించిన  కథనంలో పేర్కొంది. కాగా ఇరు దేశాల మధ్య చోటుచుసుకున్న ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే. (గల్వాన్‌ వంతెన నిర్మాణం విజయవంతం)

ఆ చిత్రాల ప్రకారం జూన్‌ 9 నుంచే వివాదాస్పద ప్రాంతాల్లో చైనా సైన్యాన్ని మోహరించింది. గుట్టుచప్పుడు కాకుండా ఒక్కో వాహనాన్ని తరలిస్తూ జూన్‌ 15 నాటికి భారీగా ఆయుధ సామాగ్రి​, బుల్డోజర్‌ వాహనాలను గల్వాన్‌ లోయకు చేర్చింది. పై చిత్రం ప్రకారం వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కి 2.8 కిమీ దూరంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ)కి చెందిన 127 వాహనాలు మోహరించబడ్డాయి. (చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం)

వివాదాస్పద గల్వాన్‌ ప్రాంతంలో చైనా ఏర్పాటు చేసిన ఆర్మీ క్యాంపు. ఇది వాస్తవాధీన రేఖకు 2.9 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రకారం చైనా అక్కడేదో నిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తోంది.

జూన్‌ 16 నాటికి చైనా మరింత దూకుడు పెంచింది. ఎల్‌ఏసీకు కేవలం 1.3 కిలోమీటర్ల దూరంలో (భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో) ఏకంగా 79 వాహనాలను చేర్చింది. భారత్‌ చెబుతున్నట్లు ఇదంతా కూడా ఎల్‌ఏసీకి ఇవతలి వైపు (భారత్‌వైపు) ఉన్న ప్రాంతం. అయినప్పటికీ చైనా సైన్యం సరిహద్దును ఉల్లంఘించి భారత భూభాగంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే ఇరు పక్షాల మధ్య చెలరేగిన హింసలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top