లంకేష్‌పై చేతన్‌ ఆరోపణలు | Gauri Lankesh was an Extortionist: Sanatan Sanstha | Sakshi
Sakshi News home page

లంకేష్‌పై చేతన్‌ ఆరోపణలు

Sep 6 2017 3:07 PM | Updated on Sep 17 2017 6:29 PM

లంకేష్‌పై చేతన్‌ ఆరోపణలు

లంకేష్‌పై చేతన్‌ ఆరోపణలు

దుండగుల చేతుల్లో దారుణ హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు గుంజేవారని సనాతన్‌ సంస్థా అధికారిక ప్రతినిధి చేతన్‌ రాజన్‌ అన్నారు.

బెంగళూరు: దుండగుల చేతుల్లో దారుణ హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు గుంజేవారని సనాతన్‌ సంస్థా అధికారిక ప్రతినిధి చేతన్‌ రాజన్‌ అన్నారు. ఆమెకు మావోయిస్టులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అయితే, కమ్యునిజం భావజాలం ఉన్న వ్యక్తులు హత్యకు గురవుతున్నప్పుడు స్పందిస్తున్నవారంతా హిందూత్వ భావజాలం ఉన్నవారు హత్యకు గురైనప్పుడు మాత్రం స్పందించడం లేదంటూ వ్యాఖ్యానించారు.

గౌరీ లంకేష్‌ హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె హత్యను తాము కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వాటిని ఏమాత్రం సహించరాదని చెప్పారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఇలా వ్యాఖ్యానించారు. గౌరీ లంకేష్‌ హత్య విషయంలో సనాతన్‌ సంస్థ హస్తం ఉందంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement