లంకేశ్‌ కేసులో పురోగతి

Gauri Lankesh killers' identity will be revealed soon: Karnataka home minister Ramalinga Reddy - Sakshi

సాక్షి, బెంగళూరు: మహిళా పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్యకేసుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గత రెండు రోజులుగా విచారిస్తోంది. అనుమానితులందరూ ఓ వివాదాస్పద సంస్థకు చెందినవారని విశ్వసనీయ సమాచారం. గదగ్‌లో వీరిని అదుపులోకి తీసుకున్న సిట్‌ బృందం వీరిని బెంగళూరుకు తీసుకువచ్చి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. కాగా, హత్య జరిగినప్పటి నుంచి దాదాపు 2,000 గంటల నిడివి గల వేర్వేరు సీసీటీవీ ఫుటేజీలను, దాదాపు కోటి ఫోన్‌ కాల్స్‌ను దర్యాప్తు బృంద సభ్యులు పరిశీలించారు. నిందితులు ఎర్రని పల్సర్‌ బైక్‌లో వచ్చినట్లు తేలడంతో కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో  ఉన్న ఆ రంగు పల్సర్‌ బైక్‌ల వివరాలను పరిశీలిస్తున్నారు. హంతకుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆదివారం జరిగిన పలు కార్యక్రమాల్లో కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి చెప్పడం గమనార్హం.

Back to Top