హిట్‌ లిస్ట్‌లో నెంబర్‌వన్‌ గిరీష్‌ కర్నాడ్‌

Gauri Lankesh Case Seized Diary Shows Two Hitlists - Sakshi

సాక్షి, బెంగళూరు : ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్య కేసు నిందితుడు అమోల్‌ కాలే నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఆ డైరీని పరిశీలించిన సిట్‌ అధికారులు హిట్‌ లిస్ట్‌లోని పేర్లను చూసి షాక్‌ తిన్నారు. హిందూత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న 37 మంది హిట్‌ లిస్ట్‌లో ఉన్నట్లు స్పెషల్‌ ఇన్వెష్టిగేషన్‌ టీం (సిట్‌) అధికారులు తెలిపారు. లిస్ట్‌లో మొదటి పేరు కన్నడ ప్రముఖ నటుడు గిరీష్‌ కర్నాడ్‌ ఉన్నట్లు సిట్‌ అధికారులు వెల్లడించారు. రెండో వ్యక్తిగా జర్నలిస్ట్‌ గౌరి లంకేశ్‌ ఉన్నట్లు గుర్తించారు. హిందూత్వ భావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న ఆరోపణలతో లంకేశ్‌ను గత ఏడాది సెప్టెంబర్‌ 5న తన ఇంటి సమీపంలోనే కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. రాడికల్‌ హిందూత్వ గ్రూప్‌ సభ్యులు ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలింది.

అదే ముఠాకి చెందిన కొం‍దరు సభ్యులు కర్ణాటక, మహారాష్ట్రాల్లో హిందుత్వ ధర్మనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న 37 మందిని టార్గెట్‌గా పెట్టుకున్నారు. 2016 నుంచి హిట్‌ లిస్ట్‌లో ఉన్న వారిపై హత్య ప్రయత్నాలు చేస్తున్నట్లు డైరీలో వారు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ కోసం 50 మంది కరుడుగట్టిన హిందుత్వవాద షూటర్లను కూడా రిక్రూట్‌మెంట్‌ చేసుకున్నారు. ఈ విషయాలను డైరీలో కోడ్‌ భాషలో రాసుకున్నటు సిట్‌ అధికారులు వెల్లడించారు. హిట్‌ లిస్ట్‌లో నంబర్‌ వన్‌గా ఉన్న గిరీష్‌ కర్నాడ్‌కు కర్ణాటక పోలీసులు గట్టి భద్రత కల్పించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top