గాలి జనార్దనరెడ్డికి బెయిలు | Gali Janardhana Reddy granted bail | Sakshi
Sakshi News home page

గాలి జనార్దనరెడ్డికి బెయిలు

Nov 15 2018 3:21 AM | Updated on Nov 15 2018 3:21 AM

Gali Janardhana Reddy granted bail - Sakshi

గాలి జనార్దనరెడ్డి

సాక్షి బెంగళూరు: యాంబిడంట్‌ ముడుపుల కేసులో గత ఆదివారం అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దనరెడ్డికి బుధవారం బెయిలు మంజూరైంది. దీంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. జనార్దనరెడ్డి తరపు న్యాయవాది చంద్రశేఖర్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో సీసీబీ (కేంద్ర నేర విచారణ విభాగం) సక్రమంగా వ్యవహరించలేదనీ, ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి జనార్దనరెడ్డిని అరెస్టు చేశారని ఆరోపించారు. కాగా, తనకు ప్రాణహాని ఉందనీ, రక్షణ కల్పించాలంటూ హోం మంత్రి పరమేశ్వరను జనార్దనరెడ్డి కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement