ప్రొఫెసర్‌ సాయిబాబాకు జీవిత ఖైదు | Gadchiroli court convicts DU professor G Saibaba for maoists links, sentenced to life imprisonment | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ సాయిబాబాకు జీవిత ఖైదు

Mar 7 2017 3:48 PM | Updated on Sep 5 2017 5:27 AM

ప్రొఫెసర్‌ సాయిబాబాకు జీవిత ఖైదు

ప్రొఫెసర్‌ సాయిబాబాకు జీవిత ఖైదు

ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా సహా ఆరుగురికి మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.

న్యూఢిల్లీ : ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా సహా ఆరుగురికి మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం అవి నిర్థారణ కావడంతో దోషులుగా నిర్థారించింది. ప్రొఫెసర్‌ సాయిబాబా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిర్థారణకు వచ్చిన కోర్టు శిక్ష ఖరారు చేసింది. సాయిబాబాతో పాటు మహేష్‌ తిక్రి, పాండు నరోటీ, విజయ్‌ టిక్రి, జేఎన్‌యూ విద్యార్థులు హేమ్‌ మిశ్రా,  మాజీ జర్నలిస్ట్‌ ప్రశాంత్‌ రాహితో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది.

 ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబాను మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై గడ్చిరోలి పోలీసులు 2014లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వికలాంగుడైన ఆయన తీవ్ర అనారోగ్యం పాలుకావటంతో తర్వాత ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, సాయిబాబాపై ఆరోపణలపై గడ్చిరోలి న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement